Share News

వైసీపీకి డాక్టర్‌ సునీత భయం

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:15 PM

డాక్టర్‌ వైఎస్‌ సునీతారెడ్డి.. ఇప్పుడు ఈ పేరు వింటేనే వైసీపీ శిబిరం జడుసుకుంటోంది. ప్రత్యక్ష రాజకీయాలు అలవాటు లేని సునీత ఇప్పు డు కాంగ్రెస్‌ ఎంపీగా పోటీ చేస్తున్న సోద రి వైఎస్‌ షర్మిల గెలుపుకోసం వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తుండడం వైసీపీని కలవరపాటుకు గురిచేస్తోంది.

వైసీపీకి డాక్టర్‌ సునీత భయం
పులివెందుల పూలంగళ్ల వద్ద వినాయకుని గుడిలో ప్రచారానికి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్న డాక్టర్‌ సునీత

సోదరి షర్మిల గెలుపు కోసం అహర్నిశలు కృషి

తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని తలపిస్తున్న వైనం

(కడప - ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ వైఎస్‌ సునీతారెడ్డి.. ఇప్పుడు ఈ పేరు వింటేనే వైసీపీ శిబిరం జడుసుకుంటోంది. ప్రత్యక్ష రాజకీయాలు అలవాటు లేని సునీత ఇప్పు డు కాంగ్రెస్‌ ఎంపీగా పోటీ చేస్తున్న సోద రి వైఎస్‌ షర్మిల గెలుపుకోసం వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తుండడం వైసీపీని కలవరపాటుకు గురిచేస్తోంది. సునీత ఇటీ వల వేస్తున్న పొలిటికల్‌ అడుగులు చూస్తే తన తండ్రి దివంగత వివేకానందరెడ్డి రాజ కీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని నిశ్శ బ్దంగా తన పని తాను చేసుకు వెళుతున్నా రని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

షర్మిలాను ఎంపీ చేయడమే లక్ష్యం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని 2019 మార్చి 15న ఆయన ఇంట్లో గొడ్డలి తో నరికి దారుణంగా చంపారు. అప్పట్లో ఈ హత్యను వైసీపీ నేతలు టీడీపీ పైకి నెట్టి ఎన్నికల్లో బాగా లబ్ధిపొందారు. అయి తే సీబీఐ విచారణతో వివేకా హత్య నింది తులెవరో తేటతెల్లమైంది. ఎంపీ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ నిందితులుగా చేర్చింది. దీంతో ఒక్కసారి జగన్‌ కుటుంబం చీలిపోయింది. వివేకా హంతకులకు శిక్ష పడాలని సునీత చేస్తు న్న పోరాటానికి షర్మిల మద్దతు ఇచ్చారు. వివేకా చివరి కోరిక తనను ఎంపీ చేయా లన్నదే అని షర్మిల ప్రకటించారు. అది నెరవేర్చడం, వివేకా హత్య కేసులో నింది తుడు పార్లమెంటుకు వెళ్లకుండా ఉండేం దుకు పోటీ చేస్తున్నట్లు షర్మిల, సునీత ప్రకటించారు.

ఇప్పటికే షర్మిల బస్సు యాత్ర జిల్లాలో సక్సెస్‌ అయింది. బస్సు యాత్రలో డాక్టర్‌ సునీత సైతం పాల్గొన్నా రు. వివేకా హత్య కేసులో నిందితులకు ఓటు వేయవద్దంటూ బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. వివేకా సన్నిహితులను 15 రోజులుగా సునీత కలుస్తూ వస్తున్నారు. పులివెందుల, వేంపల్లె, కడప.. ఇలా వివేకా అనుచరులుగా ఉన్న వారందరినీ కలిసి వివేకా చివరి కోరిక మేరకు షర్మిలాను ఎంపీగా గెలిపించాలని కోరుతూ.. వ్యూహా త్మకంగా అందరి మద్దతు కూడగడుతూ వస్తున్నారు. అలాగే పులివెందులలో తిరు గుతూ వివేకాను చంపిన హంతకులకు ఓటు వేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం షర్మిలా గెలుపు కోసం ప్రచారా నికి సునీత శ్రీకారం చుట్టారు. పులివెందు ల పూలంగళ్ల వద్ద వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం చేప ట్టారు. చాపకింద నీరులా సునీత తన తండ్రి వివేకాను తలపించేలా ముందుకు వెళుతుండటం వైసీపీ నేతలను కలవర పాటుకు గురిచేస్తోంది.

Updated Date - Apr 18 , 2024 | 11:15 PM