Share News

కిశోర్‌కుమార్‌రెడ్డి నామినేషన దాఖలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:48 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి గురువారం నామినేషన దాఖలు చేశారు.

కిశోర్‌కుమార్‌రెడ్డి నామినేషన దాఖలు
కిశోర్‌కుమార్‌ రెడ్డిని ఆశీర్వదిస్తూ దువా చేస్తున్న ముస్లిం మత పెద్దలు

పీలేరు, ఏప్రిల్‌ 18: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి గురువారం నామినేషన దాఖలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన విడుదలైన మొదటి రోజే ఆయన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, పీలేరు ఎన్నికల అధికారి ఫర్మాన అహ్మద్‌ఖాన ముందు తన అభ్యర్థిత్వానికి సంబం ధించి న నామినేషను పత్రాలు దాఖలు చేశారు. కుటుంబ సమేతంగా ఎన్నికల కార్యాలయానికి వెళ్లిన కిశోర్‌కు మార్‌ రెడ్డి రెండ్లు సెట్ల నామినేషన పత్రాలు దాఖలు చేశారు. అనంతరం ఆయన సతీమణి నల్లారి తనూజా రెడ్డి కూడా టీడీపీ అభ్యర్థిగా నామినేషన వేశారు. అన్ని రకాల పత్రాలను జత చేసిన అనంతరం ఎన్నికల అధి కారికి ఆమె నామినేషన పత్రాలు అందజేశారు. అదే విధంగా కిశోర్‌కు మార్‌ రెడ్డి తనయుడు డాక్టర్‌ నల్లారి అమరనాథరెడ్డి కూడా టీడీపీ అభ్యర్థిగా నామినేషన పత్రాలు ఎన్నికల అధికారి ముందు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా పరిమిత సంఖ్యలో మాత్రమే ఎన్నికల కార్యాలయంలోకి అనుమతించారు. కిశోర్‌కు మార్‌ రెడ్డి కుమార్తె డాక్టర్‌ వైష్ణవీ రెడ్డి, ఆయ న సోదరుడు సంతోష్‌ కుమార్‌రెడ్డి, బావ ప్రదీప్‌కు మార్‌రెడ్డి కుటుంబీకులను మాత్రమే అనుమతించారు.

నల్లారి కిశోర్‌ నామినేషనకు తరలిన నాయకులు

వాల్మీకిపురం, ఏప్రిల్‌ 18: టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన నల్లారి కిశోర్‌కు మార్‌రెడ్డి నామినేషన కార్యక్రమానికి వాల్మీకిపురం మండల వ్యాప్తంగా నాయకులు, కార్యక ర్తలు తరలివె ళ్లారు. గ్రామాల నుంచి వాహనాలు ఏర్పాటు చేసుకుని పీలేరుకు పయనమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తామంతా నల్లారి కిశోర్‌ వెన్నెంటే ఉండి ఆయన గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో పీలేరులో టీడీపీ జెండా ఎగరడం తఽథ్య మన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు న ల్లారి కిశోర్‌ నామినేషనకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.

కిశోర్‌ గెలుపు కోసం ముస్లిం పెద్దల ‘దువా’

కలికిరి, ఏప్రిల్‌ 18: పీలేరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి గురువారం నామినేషన దాఖలు చేస్తున్న సందర్భంగా నగరిపల్లెలోని ఆయన ఇంటి వద్ద ముస్లిం మత పెద్దలు దువా నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ ఈ దువా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం మత పెద్దలు కిశోర్‌కుమార్‌ రెడ్డి గెలుపుతో నియోజక వర్గం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దువా నిర్వహించిన ముస్లిం పెద్దలకు కిశోర్‌ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వలే ముస్లింల అభివృద్ధికి, సంక్షేమా నికి తాను శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు హఫీజ్‌ సయ్యద్‌ జాఫర్‌, ముఫ్తీ అహ్మదుల్లా, కరీముల్లా, హఫీజ్‌ యూన స్‌, అన్సర్‌ బాషా, మూర్తకా, అబ్దుల్‌ ఖదీర్‌, అల్లాబక్షు, నిజాముద్దీన, గోల్డ్‌ అబ్దుల్‌ ఖదీర్‌, వైజాగ్‌ బాషా, జుబేర్‌, మసూద్‌, ఖాజాపీర్‌, హబీబ్‌, ఇస్మాయిల్‌, రఫీ హజరత, మున్వర్‌, అహ్మద్‌ షరీష్‌ పాల్గొన్నారు.

మదనపల్లెలో తొలి నామినేషన కూటమి అభ్యర్థిదే

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 18: సాధారణ ఎన్నికల నామినేషన ప్రక్రియలో భాగంగా మదనపల్లె నియోజ కవర్గానికి తొలి రోజున టీడీ పీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎం.షాజహానబాషా తొలి బోణిగా నామినేషన దాఖలు చేశారు. నలుగురు అనుచరులతో వెళ్లి నిరాడంబరంగా రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌కు 12.30గంటల సమయంలో నామినేషన పత్రాలు దాఖ లు చేశారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాదెళ్ల శివన్న, ఖాజాహుస్సేన, మాజీ జడ్పీటీసీ రంగప్ప పాల్గొ న్నారు. నామినేషన స్వీకరణ సమయం 3గంటలకు ముగియడంతో కేవలం ఒక్క నామినేషన మాత్రమే వచ్చిందని రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ తెలిపారు. ఎన్నికల నామినేషన ప్రక్రియ ప్రారంభం కాగానే సబ్‌ కలెక్టరేట్‌కు 100 మీటర్ల దూరం వరకు నిషిద్ద ప్రాంతం గా పోలీసులు ప్రకటించి కేవలం నామినేషన వేసే అభ్యర్థులు, వారి వెంట వచ్చే నలుగురు వ్యక్తులకు మా త్రమే సబ్‌కలెక్టరేట్‌ లోనికి అనుమతించారు. పుంగ నూరు-మదనపల్లె జాతీయ రహదారి కావడంతో బస్సు లు, ఇతర వాహనాలను ఎనవీఆర్‌ లేఅవుట్‌ మీదుగా ఎంపీడీవో కార్యాలయం చిత్తూరు బస్టాండు వైపునకు ట్రాఫిక్‌ మళ్లించారు.

తంబళ్లపల్లెలో:ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజై న గురు వారం తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి ద్వారకనా థరెడ్డి నామినేషన దాఖలు చేశారు. తంబళ్లపల్లె రిటర్నింగ్‌ అధికా రి రాఘవేంద్రకు నామి నేషన పత్రాలను అందచేశారు. అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతించారు.

Updated Date - Apr 18 , 2024 | 11:48 PM