Share News

వైసీపీకి ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి రాజీనామా?!

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:26 PM

వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీపీ ముద్దా బాబుల్‌ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం రాత్రి పుల్లంపేటలోని బైపాస్‌లో తన అనుచరులతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు.

వైసీపీకి ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి రాజీనామా?!
విలేకరులతో మాట్లాడుతున్న ముద్దా బాబుల్‌రెడ్డి

పుల్లంపేట, ఏప్రిల్‌ 19: వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీపీ ముద్దా బాబుల్‌ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం రాత్రి పుల్లంపేటలోని బైపాస్‌లో తన అనుచరులతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. పెద్దిరెడి రామచంద్రరెడ్డి ఆదేశాలతో శుక్రవారం మండలం లో ఎన్నికల ప్రచారం ప్రారంభినన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత కొల్లం గంగిరెడ్డితో కలిసి ప్రచారం చేయాలని, తన నాయకత్వం బాగోలేదని కొంతమంది చెప్పారన్నారు. ఉమ్మడి జిల్లాలో కమలాపురం రవీంద్రరెడ్డి తర్వాత వైసీపీలో తానే సీనియర్‌ నాయకుడినని, ఇప్పటివరకు ఆస్తులు పోగొట్టుకొని జైలు పాలయ్యామన్నారు. ఇంతవరకు ఎటువంటి పదవులు పొందలేదన్నారు. తన నాయకత్వం బాగా లేదన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సస్పెండ్‌ చేయక ముందుగానే పార్టీ నుంచి వైదొలగుతున్నానన్నారు. నాపై ఎవరెవరో కుట్రలు చేస్తున్నారన్నారు. తనను బలహీన పరిచేందుకు తమ గ్రామంలో తమ పార్టీ నాయకులే టీడీపీకి మద్దతు తెలుపుతున్నారన్నారు. కొద్ది రోజుల తర్వాత భవిష్యత కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ప్రచారం ముగిసిన తర్వాత, తిరిగి ప్రచారం చేయడం తన నాయకత్వాన్ని హేళన చేయడమేనని అందుకే ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పుల్లంపేట సర్పంచ ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి, బొమ్మితొట్టి రాజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:26 PM