Share News

వాహనానికి నిప్పంటించడం దుర్మార్గం

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:53 PM

వాల్మీకిపురం మండలం విఠలం గ్రామం వద్ద టీడీపీ ప్రచార రథాన్ని కాల్చివేయడం దుర్మార్గం, ఈ ఘటన వైసీపీ నాయకుల పిరికిపంద చర్య అని రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ ధ్వజమెత్తారు.

వాహనానికి నిప్పంటించడం దుర్మార్గం
పీలేరు సమావేశంలో మాట్లాడుతున్న కూటమి నాయకులు

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 27: వాల్మీకిపురం మండలం విఠలం గ్రామం వద్ద టీడీపీ ప్రచార రథాన్ని కాల్చివేయడం దుర్మార్గం, ఈ ఘటన వైసీపీ నాయకుల పిరికిపంద చర్య అని రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ ధ్వజమెత్తారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాల్మీకిపురం మండలంలో కూటమి అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సతీమణి తనూజరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని, రెండులో రోజులుగా ఆమెకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. ఇదంతా చూసి భయపడిన వైసీపీ నాయకులు ఆడవారిని బయపెట్టా లని కుందేలువారిపల్లె నుంచి చింతపర్తికి వెళుతున్న టీడీపీ ప్రచారం రథంపై ఇద్దరు దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారన్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌ బాబాచారి తీవ్రంగా గాయపడ్డారన్నారు. సౌమ్యులుగా పేరున్న నల్లారి కుటుంబం ఈఘటనను సీరియస్‌గా తీసుకుందని, పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి ఇద్దరు దుండగులు, వారి వెనుక ఉన్న బడా నాయకులను అరెస్టు చేయాలన్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగివుంటుందని ఆర్‌జే వెంకటేశ ఆరోపించారు. దమ్ముదైర్యం వుంటే నిజాయితీ రాజకీయాలు చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రభాకర్‌, అన్వర్‌ బాషా, దుర్గాప్రసాద్‌, శివకృష్ణ, రామన్న, మహేష్‌రెడ్డి పాల్గొన్నారు.

కలకడలో:వాల్మీకీపురం మండలం విఠలం వద్ద టీడీపీ ప్రచార వాహ నానికి దుండగులు నిప్పంటించడం దుర్మార్గమైన చర్య అన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ అన్నారు. శనివారం ఆయన కలకడ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ పూర్వపు వాయ ల్పాడు, 2009 నుంచి పీలేరు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రశాంతంగా ఎన్నిలకు జరిగేవన్నారు. 2019లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయించడం, దాడులు జరపడం సర్వసాధారణమన్నారు. వైసీపీ నాయకులు ఓటమి భయంతోనే ప్రజాస్వామ్యా హక్కులను కాలరా స్తున్నారన్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి చర్యలు తీసుకోవా లని డిమాండు చేశారు. కార్యక్రమంలో నాయకులు బరకం శ్రీనివాసు లరెడ్డి, శ్రీనివాసులనాయుడు, ఈశ్వరయ్య, ఆనంద్‌రెడ్డి, ఫీరయ్య, మహల్‌ మహ్మద్‌ అలీ, జిలానీ, నౌషాద్‌, ఖాజా, ఇమ్రాన, ఇర్ఫాన, ప్రసాద్‌నాయుడు, రెడ్డెప్ప, వెంకరమణ, ప్రశాంతలు పాల్గొన్నారు.

పీలేరులో: వాల్మీకిపురం మండలం విఠలం వద్ద టీడీపీ ప్రచార రథాన్ని వైసీపీ మూకలు దహనం చేయడం దారుణమని పీలేరులోని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పీలేరులోని పార్టీ కార్యాలయంలో శనివారం వారు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజం పేట పార్లమెంటు అధికార ప్రతినిధి కోటపల్లె బాబు రెడ్డి మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని అప్రజాస్వామిక పద్ధతులను వైసీపీ నాయకులు ప్రోత్సహించడం సహేతుకం కాదన్నారు. ప్రచార రథం దహనం వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. మాజీ జడ్పీటీసీ మల్లెల రెడ్డిబాషా మాట్లాడుతూ వలంటీర్లపై చంద్రబాబు నాయుడు మాట్లాడిన తరువాత వైసీపీ నాయకులు వారిచేత రాజీనామాలు చేయించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు యల్లెల రెడ్డప్పరెడ్డి, పోలిశెట్టి సురేంద్ర, పురం రామ్మూర్తి, ఆర్‌బీఐ రమణారెడ్డి, స్పోర్ట్స్‌ మల్లి, హనీఫ్‌, రహంతుల్లా, గాండ్ల విజయ్‌ కుమార్‌, మహమ్మద్‌పీర్‌, ఫర్హత అలీ, సందీప్‌, వెంకటరమణ నాయక్‌, బుజ్జు, జయన్న, షౌకత అలీ, అతార్‌ చాను, మల్లి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:53 PM