Share News

ఎన్టీఆర్‌ జిల్లా అభ్యర్థులు 106 మంది

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:17 AM

ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం జిల్లా ఎన్నికల యంత్రాంగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 332 నామినేషన్లలో 106 నామినేషన్లు ఆమోదం పొందాయి. మిగిలిన వాటిలో 70 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇంకా 156 నామినేషన్లు అదనపు సెట్లుగా రావటంతో పక్కన పెట్టారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం గణాంకాలను విడుదల చేసింది.

ఎన్టీఆర్‌ జిల్లా అభ్యర్థులు 106 మంది

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం జిల్లా ఎన్నికల యంత్రాంగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 332 నామినేషన్లలో 106 నామినేషన్లు ఆమోదం పొందాయి. మిగిలిన వాటిలో 70 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇంకా 156 నామినేషన్లు అదనపు సెట్లుగా రావటంతో పక్కన పెట్టారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం గణాంకాలను విడుదల చేసింది.

గుర్తింపు పొందిన పార్టీల నుంచి..

తెలుగుదేశం (టీడీపీ), వైఎ్‌సఆర్‌సీపీ (వైసీపీ), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎ్‌సపీ), కాంగ్రెస్‌ పార్టీ (ఐఎన్‌సీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సీపీఎం, సీపీఐ అభ్యర్థులు గుర్తింపు పొందిన పార్టీల పరిధిలోకి వస్తారు. వీటిలో ప్రధానమైనవిగా టీడీపీ, వైసీపీలు ఉన్నాయి. ఈ పార్టీలకు సంబంధించి మొత్తం 27 మంది అభ్యర్ధుల నామినేషన్లు ఆమోదం పొందాయి. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 4, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 4, విజయవాడ పశ్చిమలో 3, విజయవాడ సెంట్రల్‌లో 4, విజయవాడ తూర్పులో 4, మైలవరంలో 4, నందిగామలో 4, జగ్గయ్యపేటలో 4 చొప్పున అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి.

గుర్తింపులేని పార్టీల నుంచి..

గుర్తింపు లేని పార్టీలకు సంబంధించి చూస్తే మొత్తం 39 నామినేషన్లు ఆమోదం పొందాయి. నవరంగ్‌ కాంగ్రెస్‌, పిరమిడ్‌ పార్టీ, జాతీయ జనసేన పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, జై భారత్‌ నేషనల్‌ పార్టీ, జనవాహిని పార్టీ, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ, జై మహాభారత్‌ పార్టీ, రిపబ్లికన్‌ పార్టీ, తెలుగు రాజాధికార పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి, సోషలిస్టు యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్టు), జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ, నవతరం పార్టీ వంటి అన్‌రిజిస్టర్డ్‌ పార్టీలకు సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా 39 నామినేషన్లు ఆమోదం పొందాయి. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 10, తిరువూరు అసెంబ్లీ పరిధిలో 4, విజయవాడ పశ్చిమలో 10, విజయవాడ సెంట్రల్‌లో 7, విజయవాడ తూర్పులో 8, మైలవరంలో 4, నందిగామలో 5, జగ్గయ్యపేటలో 1 చొప్పున నామినేషన్లు ఆమోదం పొందాయి.

స్వతంత్ర అభ్యర్థుల నుంచి..

స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి 40 నామినేషన్లు ఆమోదం పొందాయి. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 5, తిరువూరు అసెంబ్లీ పరిధిలో 5, విజయవాడ పశ్చిమలో 4, సెంట్ర్‌లో 11, తూర్పులో 5, మైలవరంలో 4, నందిగామలో 2, జగ్గయ్యపేటలో 9 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

ఫ పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రంగంలో ఉన్న అభ్యర్థుల విషయానికి వస్తే.. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 19 మంది నామినేషన్లు అమోదం పొందగా, తిరువూరు అసెంబ్లీ పరిధిలో 13, విజయవాడ పశ్చిమలో 17, సెంట్రల్‌లో 22, తూర్పులో 17, మైలవరంలో 12, నందిగామలో 11, జగ్గయ్యపేటలో 14 నామినేషన్లు ఆమోదం పొందాయి.

Updated Date - Apr 28 , 2024 | 12:17 AM