Share News

17,04,077

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:46 AM

ఎన్టీఆర్‌ జిల్లా మొత్తంగా 17,04,077 మంది ఓటర్లు నమోదయ్యారు. ఓటర్ల తుది జాబితా వివరాలను జిల్లా యంత్రాంగం శనివారం విడుదల చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా, నామినేషన్ల స్ర్కూటినీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2024, జనవరి 22న విడుదల చేసిన డ్రాఫ్టు ఓటర్ల జాబితా ప్రకారం ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా 16,74,995 మంది ఓటర్లు నమోదయ్యారు.

17,04,077

జిల్లాలో తుది ఓటర్ల సంఖ్య ఇది

అత్యధికంగా మైలవరంలో, అత్యల్పంగా జగ్గయ్యపేటలో

ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తి

డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా తర్వాత కొత్త ఓటర్ల పెరుగుదల

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్టీఆర్‌ జిల్లా మొత్తంగా 17,04,077 మంది ఓటర్లు నమోదయ్యారు. ఓటర్ల తుది జాబితా వివరాలను జిల్లా యంత్రాంగం శనివారం విడుదల చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా, నామినేషన్ల స్ర్కూటినీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2024, జనవరి 22న విడుదల చేసిన డ్రాఫ్టు ఓటర్ల జాబితా ప్రకారం ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా 16,74,995 మంది ఓటర్లు నమోదయ్యారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఏప్రిల్‌ 14న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా కాస్తా ఫ్రీ ఫైనల్‌ ఓటర్ల జాబితాగా మారిపోయింది. డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా నుంచి ఫ్రీ ఫైనల్‌ ఓటర్ల జాబితా ప్రకారం తేడా చూస్తే 22,027 మంది ఓటర్లు పెరిగారు. తాజాగా విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం చూస్తే మరో 7,755 మంది ఓటర్లు పెరిగారు. ఈ లెక్కన మొత్తంగా చూస్తే 29,782 మంది కొత్త ఓటర్లు పెరిగారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం ఎన్టీఆర్‌ జిల్లా ఓటర్ల సంఖ్య 17,04,077 మందికి పెరిగింది. మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. జిల్లా మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 8,73,427 మంది ఉన్నారు. పురుషులు 8,30,499 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 42,928 మంది ఎక్కువ. థర్డ్‌ జెండర్‌ ఓటర్లుగా 151 మంది ఉన్నారు.

నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితా

నియోజకవర్గం పురుషులు మహిళలు థర్డ్‌జెండర్‌ మొత్తం

తిరువూరు 1,01,994 1,05,190 6 2,07,190

విజయవాడ పశ్చిమ 1,26,634 1,29,296 33 2,55,963

విజయవాడ సెంట్రల్‌ 1,34,829 1,42,845 50 2,77,724

విజయవాడ తూర్పు 1,32,441 1,42,845 23 2,75,309

మైలవరం 1,36,740 1,44,972 20 2,81,732

నందిగామ 99,398 1,06,076 6 2,05,480

జగ్గయ్యపేట 98,463 1,06,888 13 2,05,364

మొత్తం ఓటర్లు 8,30,499 8,73,427 151 17,04,077

Updated Date - Apr 28 , 2024 | 12:46 AM