Share News

నీటి కాసులపై అవగాహన

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:28 AM

నీటి కాసులతో శాశ్వతంగా అంధత్వం ప్రాపిస్తుందని, ప్రారంభ దశలోనే నీటి కానులను గుర్తిస్తే అంధత్వ నివారణ అత్యంత సులువని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్‌ కె. శైలజ పేర్కొన్నారు.

నీటి కాసులపై అవగాహన
మాట్లాడుతున్న డాక్టర్‌ శైలజ

నీటి కాసులపై అవగాహన

పటమట: నీటి కాసులతో శాశ్వతంగా అంధత్వం ప్రాపిస్తుందని, ప్రారంభ దశలోనే నీటి కానులను గుర్తిస్తే అంధత్వ నివారణ అత్యంత సులువని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్‌ కె. శైలజ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్‌హోమ్‌లో డాక్టర్‌ మారు అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె నీటి కాసులు అంశంపై ప్రసంగించారు. శైలజ మాట్లాడుతూ నీటి కాసులనే గ్లకోమా అంటారని, నీటి కాసులపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమన్నారు. లేజర్‌ చికిత్స, శస్త్ర చికిత్స చేయించుకోవడం ద్వారా అంధత్వం కలగకుండా నివారించవచ్చునని తెలిపారు. గ్లకోమా ఉన్నవారు డాక్టర్‌తో రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలన్నారు. గ్లకోమా ఉన్నప్పటికీ జీవితాంతం చక్కని చూపుతో హాయిగా ఉండవచ్చునన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:28 AM