Share News

కరోనా కంటే జోగి ప్రమాదకరం

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:08 AM

కరోనా కంటే మంత్రి జోగి ప్రమాదకరమని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. పెనమలూరు మండలం వణుకూ రులో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ, పెనమలూరు నియోజకవర్గం లో ప్రశాంత వాతావారణాన్ని జోగి రమేష్‌ కలుషితం చేస్తున్నారన్నారు.

 కరోనా కంటే జోగి ప్రమాదకరం
పోరంకిలో జరిగిన ప్రచారయాత్రలో బోడె ప్రసాద్‌

కంకిపాడు, ఏప్రిల్‌ 27 : కరోనా కంటే మంత్రి జోగి ప్రమాదకరమని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. పెనమలూరు మండలం వణుకూ రులో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ, పెనమలూరు నియోజకవర్గం లో ప్రశాంత వాతావారణాన్ని జోగి రమేష్‌ కలుషితం చేస్తున్నారన్నారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలను పెనమలూరు ప్రజ లపై మోపేందుకు సిద్ధం అయ్యారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్‌, కోయా ఆనంద్‌, మార్పూడి ధనకోటేశ్వరరావు, కొమ్మినేని శ్రీను, పిడికిటి శ్రీను, సుంకర రమేష్‌, కాసరనేని మురళి, పులి విజయ్‌, ఉయ్యూరు మహేష్‌, జనసేన పార్టీ నాయకులు ముప్పా రాజా, బీజేపీ నాయకులు విజయేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ ప్రజలకు అందుబాటులో ఉండే టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ను గెలిపిద్దామని టీడీపీ సీనియర్‌ నాయకులు మద్దాలి సాయిబాబు, రామచంద్రరావు అన్నారు. కంకిపాడు మండలంలోని పునాదిపాడులో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాసరనేని కరుణ, ముసిబోయిన వెంకటేశ్వరరావు, కిషోర్‌ పాల్గొన్నారు.

టీడీపీతోనే దళితుల సంక్షేమం

పెనమలూరు : దళిత వర్గాల సంక్షేమం టీడీపీతోనే సాఽధ్యమని టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. శనివారం పోరంకి బీజేఆర్‌ నగర్‌, సాలిపేటల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ వర్గాల పిల్లల విద్యాభ్యాసానికి టీడీపీ ప్రభుత్వం 1984లోనే భరోసా కల్పించిందని, ప్రత్యేక సొసైటీని నెలకొల్పి దీని ద్వారా గురుకుల పాఠశాలలను నెలకొల్పిందని, పెరిగిన ఎస్సీ జనాభా కోసం అప్పటివరకు ఉన్న 14శాతం రిజర్వేషన్లను 15శాతానికి పెంచింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. నాఎస్సీలు...నాఎస్టీలంటూ ప్రేమ ఒలకబోస్తున్న సైకో జగన్‌ హయాంలో దళితులపై దాడులు ఈ ఐదేళ్లలో నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనుమోలు ప్రభాకరరావు, గట్టు వాణి, వేమూరి స్వరూపరాణి, విశ్వేశ్వరరావు, వడ్లమూడి శుభశేఖర్‌, బొప్పన లావణ్య, చెన్నుపాటి శ్రీనివాస్‌, తుమ్మత రాంకుమార్‌, అంకెం రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:08 AM