Share News

కూటమి మేనిఫెస్టోతో మహిళల సమగ్రాభివృద్ధి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:11 AM

టీడీపీ కూటమి మేనిఫెస్టో రాష్ట్ర మహిళల సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుందని బోడె ప్రసాద్‌ సతీమణి బోడె హేమ, తనయ వైష్ణవి పేర్కొన్నారు. శనివారం యనమలకుదురులో జరిగిన ప్రచార పాదయాత్ర నిర్వహించారు.

 కూటమి మేనిఫెస్టోతో మహిళల సమగ్రాభివృద్ధి
యనమలకుదురులో బోడె హేమ, వైష్ణవి ప్రచారం

పెనమలూరు, ఏప్రిల్‌ 27: టీడీపీ కూటమి మేనిఫెస్టో రాష్ట్ర మహిళల సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుందని బోడె ప్రసాద్‌ సతీమణి బోడె హేమ, తనయ వైష్ణవి పేర్కొన్నారు. శనివారం యనమలకుదురులో జరిగిన ప్రచార పాదయాత్ర నిర్వహించారు. వారి వెంట అనంతనేని ఆజాద్‌, మొక్కపాటి శ్రీనివాస్‌, శొంఠి శివరాంప్రసాద్‌, పాదాల ప్రభాకర్‌, బలగం నాగరాజు, మల్లంపాటి విజయలక్ష్మి, వడ్డి జీవ, బెజవాడ వెంకటేష్‌, గోగినేని రామారావు, చెన్నుపాటి వెంకటేశ్వరరావు, పొ ట్లూరి కిరణ్‌, కమ్మిలి నాగేశ్వరరావు, వెంకటేష్‌ ఉన్నారు.

కానూరులో..

ముస్లిం మైనారిటీల సంక్షేమం పట్ల టీడీపీకి మాత్రమే చిత్తశుద్ధి ఉందని టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు పేర్కొన్నారు. శనివారం కానూరు సనత్‌నగర్‌ రేకుల మసీదు ప్రాంతంలో జరిగిన ప్రచారయాత్ర నిర్వహిం చారు. టీడీపీ కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న బోడె ప్రసాద్‌ను, బాలశౌరిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట స్థానిక నేతలు ఉన్నారు.

ఉయ్యూరు : తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అన్ని వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి సాధ్య మవుతుందని టీడీపీ నాయకుడు మీసాల అప్పల నాయడు అన్నారు. కూటమి అభ్యరు ్థల గెలుపును కాంక్షిస్తూ శనివారం ఉయ్యూరు 13వ వార్డులో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిరిగూడి చింతయ్య, లంక అప్పల నాయుడు, ప్రసాద్‌, తరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఫ బాలశౌరి, బోడె ప్రసాద్‌ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నాయకుడు బత్తుల కామేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం కలవపాముల ఎస్సీకాలనీలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఎస్సీ సెల్‌ నాయకుడు బండి కృష్ణబాబు, డి నాగేశ్వరరావు, జల్లే కోటేశ్వరరావు పాల్గొన్నారు.

ముదునూరులో వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దాకారపు అజయ్‌బాబుతో పాటు ఆపార్టీకి చెందిన 50 కుటుంబాలు శనివారం జనసేనపార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు జరుగు ఆదినారాయణ, ఉయ్యూరు చైర్మన్‌ వి సత్యనారాయణ, కొలుసు పోతురాజు పలువురు టీడీ పీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:11 AM