Share News

ఈవీఎంలపై పూర్తి అవగాహన ఉండాలి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:19 AM

ఎన్నికలు సజావుగా నిర్వహించాలంటే ఈవీఎంలం పనితీరుపై సెక్టార్‌ అధికారులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. జెడ్పీ కన్వెన్షన్‌హాలులో శనివారం సెక్టార్‌ అధికారులకు ఈవీఎంల కమీషనింగ్‌ అంశంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈవీఎంలపై పూర్తి అవగాహన ఉండాలి

మచిలీపట్నం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికలు సజావుగా నిర్వహించాలంటే ఈవీఎంలం పనితీరుపై సెక్టార్‌ అధికారులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. జెడ్పీ కన్వెన్షన్‌హాలులో శనివారం సెక్టార్‌ అధికారులకు ఈవీఎంల కమీషనింగ్‌ అంశంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌రోజున బ్యాలెట్‌యూనిట్‌, కంట్రోల్‌యూనిట్‌, వీవీప్యాట్‌ కంట్రోల్‌ యూనిట్లను సక్రమంగా కనెక్ట్‌ చేయాల్సి ఉందన్నారు. ఈ మూడింటిని సక్రమంగా అనుసంధానం చేస్తేనే పోలింగ్‌ సమయంలో సాంకేతికలోపాలు తలెత్తకుండా పోలింగ్‌ ముందుకు సాగుతుందన్నారు. శిక్షణ పొందిన అధికారులు ప్రయోగాత్మకంగా వీటిని పరిశీలనచేసి పరిపూర్ణ అవగాహనకు రావాలన్నారు. సెక్టార్‌ అధికారుల పరిధిలో ఉన్న పోలింగ్‌ అధికారులకు, సిబ్బందికి ఈవీఎంలు పనిచేసే తీరును అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. జేసీ గీతాంజలి శర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్‌వోలు, సెక్టార్‌ అధికారులు ఈశిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:19 AM