Share News

పసుపుమయం

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:10 AM

బోడె ప్రసాద్‌ నామినేషన్‌ సందర్భంగా జరిగిన ర్యాలీతో బందరు రోడ్డు పసుపుమయంగా మారింది. పోరంకి టీడీపీ కార్యాలయం నుంచి నామినేషన్‌ వేయడానికి పాదయాత్రగా పది గంటలకు బయలు దేరిన బోడె ప్రసాద్‌ పోరంకి సెంటరుకు చేరుకోవడానికి అరగంటకు పైగా సమయం పట్టింది.

పసుపుమయం
ప్రచార రథంపై బోడెతో పాటు బాలశౌరి, కొనకళ్ల, వంగవీటి రాధా, పంచుమర్తి అనురాధ, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, వెలగపూడి, అనుమోలు

బోడె ప్రసాద్‌ నామినేషన్‌కు పోటెత్తిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు

పోరంకి నుంచి బందరు రోడ్డు పొడవునా హరతులిచ్చిన అభిమానులు

పెనమలూరు, ఏప్రిల్‌ 19 : బోడె ప్రసాద్‌ నామినేషన్‌ సందర్భంగా జరిగిన ర్యాలీతో బందరు రోడ్డు పసుపుమయంగా మారింది. పోరంకి టీడీపీ కార్యాలయం నుంచి నామినేషన్‌ వేయడానికి పాదయాత్రగా పది గంటలకు బయలు దేరిన బోడె ప్రసాద్‌ పోరంకి సెంటరుకు చేరుకోవడానికి అరగంటకు పైగా సమయం పట్టింది. పోరంకి సెంటర్‌ నుంచి పెనమలూరు వరకు వందల సంఖ్యలో అభిమానులు నిరీక్షించి శుభాకాంక్షలు తెలిపారు. మార్గ మఽధ్యంలో మహిళలు బోడె ప్రసాద్‌కు హారతులిచ్చారు. బోడె కుమారుడు వెంకట్రామ్‌ భారీ టీడీపీ జెండాను ఊపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ర్యాలీతో ఆగిన ట్రాఫిక్‌ను బందరు రోడ్డులో సీఐ టీవీవీ రామారావు తన సిబ్బందితో నియంత్రించారు. పెనమలూరు సెంటరులో పార్టీ అభిమాని కిలారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు బోడెను భారీ గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో సంగెపు రంగారావు, ఆచంట వెంకటచంద్ర, కొమ్మినేని వెంకటేష్‌, వల్లభనేని నాని, దేవినేని రాజా, సూదిమళ్ల రవీంద్ర, వెనిగళ్ల కుటుంబరావు, జంపాన గుర్నాధం, అనంతనేని ఆజాద్‌, మొక్కపాటి శ్రీనివాస్‌, శొంఠి శివరాంప్రసాద్‌, పాదాల ప్రభాకర్‌, తుమ్మల రాంకుమార్‌, పీతా గోపీచంద్‌, పోలవరపు బాబీ, నర్రాచంటి, దోనెపూడి రవికిరణ్‌, అంగిరేకుల మురళి, ముసునూరు శ్రీనివాసరావు, ముసునూరి శ్రీధర్‌, గుజ్జర్లపూడి బాబూరావు, నిర్మల్‌, వడ్లమూడి శుభశేఖర్‌, తుమ్మల హరికృష్ణ, ఉయ్యూరు మహేష్‌, కొండా ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి బోడె అవసరం..

పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధికి బోడె ప్రసాద్‌ అవసరమని టీడీపీ నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం నామినేషన్‌ సందర్భంగా ఆయన బోడెను కలిసి ఆంజనేయస్వామి ఆశీస్సులు, జ్ఞాపికను అందించి మాట్లాడారు. హనుమాన్‌జంక్షన్‌ లోని ఆంజనేయస్వామి వద్ద ప్రత్యేక పూజలు చేసి నామినేషన్‌ వేస్తున్న బోడె ప్రసాద్‌ వద్దకు వచ్చి ఆం జనేయ స్వామి ఆశీర్వాదాలు అందించినట్లు తెలిపా రు. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలు బోడె ప్రసాద్‌ను ఎన్నుకోవాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర ఉన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి..

ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ను గెలిపించాలని టీడీపీ నేత మొక్కపాటి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం యనమలకుదురులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సైకో జగన్‌ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గం ముప్పై ఏళ్లు వెనక్కినెట్టబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, రైతులు, మహిళలు, కూలి పనులకు వెళ్లేవారు తీవ్రంగా నష్టపోయారని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్‌ను, ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పండుల రజిని, కొండ, బిచాలి, రమేష్‌, సరస్వతి, షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.

అవినీతికి ఓటేస్తే అవస్థలు పడతాం..

కంకిపాడు : అవినీతి పరులకు ఓటేస్తే అవస్థలు పడతారని పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. మండలంలోని దావులూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పా ల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బోడె ప్రసాద్‌కు దావులూరు గ్రామస్థు లు ఘన స్వాగతం పలికారు. అడుగుడుగునా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేశామన్నారు. ఉచిత ఇసుక, కార్పొరేషన్ల ద్వారా పేదలకు పనిము ట్లు, ఉపాధికి అవసరమైన ఆర్థిక సాయం చేశామని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడిందని, అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుదిమళ్ల రవీంద్ర, జల్లి కోటేశ్వరరావు, సెంగెపు రంగారావు, పితా గోపీచంద్‌, కందుల రాజేష్‌, పామర్తి రమేష్‌, గాలంకి వెంకటేశ్వరరావు, వల్లే విజయ్‌, పొనుగుమాటి శ్రీనివాసరావు, నత్తా నాంచారయ్య, కొప్పపల సీతారామయ్య, లీలా రాజ్‌కుమార్‌, గంటా డాని యేలు జనసేన పార్టీ నాయకులు ముప్పా రాజా, సుంకర శివ, బాయిన నాగరాజు, ముప్పా చంద్రశేఖర్‌, మేదండ్రావు సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళాభివృద్ధి బాబుతోనే సాధ్యం..

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే మహిళాభివృద్ధి జరిగిందని ఈడుపుగల్లు సర్పంచ్‌ పందిపాటి ఇందిర అన్నారు. ఈడుపుగల్లులో శుక్రవారం నిర్వహించిన బాబూ ష్యూరిటీ- భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీతోనే మహిళలకు ఆస్తి హక్కులో సమాన వాటా లభించిందన్నారు. అదే విధంగా మహి ళలు తమ కాళ్లపై తాము నిలపడాలన్న ఉద్దేశంతోనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక సాయం అందించటం వంటి అనేక సంక్షేమ పథకా లను రూపొందించి అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు దేవినేని అనీల్‌ కుమార్‌, షేక్‌ షకార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:10 AM