Share News

పారదర్శకతతో ఎన్నికల విధులు నిర్వహిద్దాం

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:12 AM

మే 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వహించడం ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకువద్దామని ఏపీ ఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌ పిలుపునిచ్చారు.

పారదర్శకతతో ఎన్నికల విధులు నిర్వహిద్దాం
మాట్లాడుతున్న ఏపీ ఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌

కృష్ణలంక, ఏప్రిల్‌ 19 : మే 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వహించడం ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకువద్దామని ఏపీ ఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించే వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు శుక్రవారం గాంధీనగర్‌లోని ఏపీ ఎన్జీవో హోంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఫారం 12 పత్రాన్ని ఇవ్వడం జరిగిందని, ఈ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారికి నిర్దేశిత సమయంలోగా ఉద్యోగులు పూర్తిచేసి రిటర్నింగ్‌ అధికారికి అందచేయాలని కోరారు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనచో తక్షణమే సంఘం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ అంశంలో, ఫెసిలిటేషన్‌ సెంటర్ల విషయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఖచ్చితమైన సమాచారం వుండే విధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నిర్దేశిత గడువుని కొన్నిరోజులు పొడిగించాలని కోరారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై ఉద్యోగ, ఉపాధ్యాయులకున్న సందిగ్ధాన్ని తొలగిస్తూ గైడ్‌లైన్స్‌ జారీ చేయాలని కోరారు. ఈసారి ఉద్యోగులకు చేతికి పోస్టల్‌ ఇవ్వరని, వాటిని మే 5, 6 తేదీల్లో సంబంధిత రిటర్నింగ్‌ అధికారి నిర్దేశించిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో అప్పటికప్పుడు జారీ చేయబడిన పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన పరిస్థితి వుందని, దీనిని అందరూ గుర్తించాలని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల ఉద్యోగుల ప్రతినిధులు, పి.రమేష్‌, బి.సతీ్‌షకుమార్‌, బీవీ రమణ, ఎం.మధుసూధనరావు, ఎస్‌.కె.నజీరుద్దీన్‌, సీవీఆర్‌ ప్రసాద్‌, పి.శ్రీనివాసరావు, కె.శివశంకర్‌, డి.విశ్వనాథ్‌, మహిళా ఉద్యోగుల ప్రతినిధి కె.శివలీల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:12 AM