Share News

టీడీపీతోనే ప్రజా సంక్షేమం

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:19 AM

ప్రజా సంక్షేమంతో కూడిన రాష్ట్రా భివృద్ధి టీడీపీ కూటమితోనే సాధ్యమని మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు అన్నారు. బొమ్ములూరు ఎస్సీ కాలనీలో శుక్రవారం టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఇంటింటి ప్రచారంలో యార్లగడ్డ సతీష్‌తో కలిసి పాల్గొన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకురు తుందని ప్రజలకు వివరిస్తూ, అభ్యర్థుల గుర్తులను చూపుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.

 టీడీపీతోనే ప్రజా సంక్షేమం
బొమ్ములూరులో ఇంటింటా టీడీపీ ప్రచారం

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌ : ప్రజా సంక్షేమంతో కూడిన రాష్ట్రా భివృద్ధి టీడీపీ కూటమితోనే సాధ్యమని మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు అన్నారు. బొమ్ములూరు ఎస్సీ కాలనీలో శుక్రవారం టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఇంటింటి ప్రచారంలో యార్లగడ్డ సతీష్‌తో కలిసి పాల్గొన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకురు తుందని ప్రజలకు వివరిస్తూ, అభ్యర్థుల గుర్తులను చూపుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వేగే కృష్ణారావు, గొల్లపూడి ప్రసాద రావు, దయాల రాజేశ్వ రరావు, మూల్పూరి సాయికళ్యాణి, గండేపూ డి నితీష్‌కుమార్‌, కాటూరి విజయభాస్కర్‌, జనసేన నాయకుడు వడ్డి శివనాగే శ్వరరావు, సింగవరపు సూర్యావతి, మాతంగి వెంకటేశ్వ రరావు, కొల్లి చందు, గరికపాటి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ : వైసీపీ పాలనలో నియోజక వర్గ అభివృద్ధి కుంటుపడిందని రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమికి అధికారమిస్తే నియోజకవర్గానికి పూర్వ వైభవం వస్తుందని టీడీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఓగిరాల, టీడీపీ జంక్షన్‌ పట్టణ కమిటీ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో బాపులపాడు గ్రామాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రజాగళం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమికి మద్దతుగా నిలవాలని, నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సోంబాబు, సజ్జా చలమారావు, సాదరబోయిన సురేష్‌, కగ్గా జ్ఞానేష్‌, వీరమాచనేని సత్యప్రసాద్‌, గార్లపాటి రాజేశ్వరరావు, తోట మురళీధర్‌, మిక్కిలినేని మురళీ, చెరుకూరి హరికృష్ణ, దాసరి బెనర్జీ, సుజాత, కర్రా ప్రసాద్‌పాల్‌, తమిరి రమేష్‌, యార్లగడ్డ వెంకటే శ్వరరావు, షేక్‌ అహ్మద్‌, వరిగంజి కిషోర్‌, గుమ్మడి శేషగిరిరావు, పొట్లూరి ఫణి, యలమంచిలి వెంకటేశ్వరారవు, కడవకొల్లు నాగరాజు, గొట్టాపు వాసు పాల్గొన్నారు.

సైకో ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి

గన్నవరం : సైకో ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న అన్నారు. పాత గన్నవరం లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం సమీపంలో టౌన్‌ పార్టీ సమావేశం అధ్యక్షుడు జాస్తి శ్రీధర్‌ అధ్యక్షతన జరి గింది. ఈ సందర్భంగా దొంతు చిన్న మాట్లాడుతూ, ఈ ఐదేళ్లలో జరిగిన దోపిడి ఎన్నడూ జరగలేదన్నారు. అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. జగన్‌కు తగిన బుద్ధి చెప్పేం దుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంక టేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిం డర్‌లు ప్రభుత్వం ఇస్తుందన్నారు. టీడీపీ నాయకులు పాలడుగు నాని, గూడపాటి తులసీ మోహన్‌, కాసన్నేని రంగబాబు, కొమ్మరాజు సుధీర్‌, మద్దినేని వెంకటేశ్వ రరావు, పడమట రంగారావు, అజిస్‌ఖాన్‌, దేవినేని సులోచన రాణి, బుస్సే సరితాదేవి, అరుణకుమారి, అన్నే జ్యోతి, పీవిఎస్‌ఆర్‌ కృష్ణ, నల్లమోతు రమేష్‌, జాస్తి ఫణిశేఖర్‌, జాస్తి మురళీకృష్ణ, బీజేపీ, జనసేన నాయకులు నాదిండ్ల మోహన్‌, చిమట రవివర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:19 AM