Share News

త్యాగశీలి గౌతు లచ్చన్న

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:13 AM

నమ్మిన సిద్ధాంతానికి కడదాక కట్టుబడిని నిస్వార్ధ ప్రజాసేవకుడు, త్యాగశీలి సర్ధార్‌ గౌతు లచ్చన్న అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ కీర్తించారు. గౌతులచ్చన్న సేవాసమితి అధ్యక్షుడు కాగిత కొండ ఆధ్వర్యంలో శుక్రవారం లచ్చన్న 18వ వర్ధంతి నిర్వహించారు.

 త్యాగశీలి గౌతు లచ్చన్న
గౌతు లచ్చన్న చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వైవీబీ రాజేంద్రప్రసాద్‌, కాగిత కొండ

ఉయ్యూరు, ఏప్రిల్‌ 19 : నమ్మిన సిద్ధాంతానికి కడదాక కట్టుబడిని నిస్వార్ధ ప్రజాసేవకుడు, త్యాగశీలి సర్ధార్‌ గౌతు లచ్చన్న అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ కీర్తించారు. గౌతులచ్చన్న సేవాసమితి అధ్యక్షుడు కాగిత కొండ ఆధ్వర్యంలో శుక్రవారం లచ్చన్న 18వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్య క్రమానికి రాజేంద్రప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరై లచ్చన్న చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. టీడీపీ సగర సంఘ రాష్ట్ర కన్వీనర్‌ జంపన శ్రీనివాస్‌, బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణి, మైనారిటీ సెల్‌ కార్యదర్శి అజ్మతుల్లా, వీరంకి శివాజి, పామర్తి శివ, నర్రా శ్రీనివాసరావు, పరశురామయ్య, జంపాన నరసింహారావు తదితరులు పాల్గొని లచ్చన్నకు నివాళులర్పించారు.

పెనమలూరు : సర్దార్‌ గౌతు లచ్చన్న త్యాగాలకు మారుపేరని టీడీపీ బీసీ సెల్‌ నాయకులు శొంఠి శివరామ్‌ప్రసాద్‌ పేర్కొన్నారు. గౌతు లచ్చన్న 18వ వర్ధంతి సందర్భంగా పోరంకి టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తన రాజకీయ గురువైన ఎన్జీరంగా గుంటూరు పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు లచ్చన్న తన శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసి రంగాను నిలబెట్టి గెలిపించిన త్యాగశీలి అని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా బోడె ప్రసాద్‌ హాజరయ్యారు. ముందుగా గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జువ్వాది రామకృష్ణ, సంగెపు రంగారావు, పీతా గోపీచంద్‌, అనుమోలు ప్రభాకరరావు, షేక్‌ బుజ్జి, వణుకూరు విక్రమ్‌, కొండవీటి శివయ్య, దేవినేని రాజా, తాడిశెట్టి వీరాస్వామి, రమేష్‌, ఆరేపల్లి దాసు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:13 AM