26న భ్రామరికి కుంభోత్సవం
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:47 PM
శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26న భ్రమరాంబాదేవికి కుంభోత్సవం నిర్వహించనున్నారు.
శ్రీశైలం, ఏప్రిల్ 19: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26న భ్రమరాంబాదేవికి కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు శుక్రవారం కుంభోత్సవ ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, దేవస్థానం యూనిట్ అధికారులు, సెక్షన్ అధికారులు, వైదిక సిబ్బంది, తహసీల్దార్ గుర్రప్ప, సీఐ ప్రసాదరావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో డి. పెద్దిరాజు మాట్లాడుతూ కుంభోత్సవ వేడుకల కైంకర్యాలంన్నింటినీ పరిపూర్ణంగా జరిపించాలని వైదిక సిబ్బందికి సూచించారు. క్షేత్ర పరిధిలో జంతు బలులు జరగకుండా అఽధికారులు సహకరించాలని అన్నారు. కుంభోత్సవం సందర్భంగా మద్యం అమ్మకాలను నిలిపేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టరును కోరాలని అన్నారు.