Share News

ఇంటి వద్దనే పింఛన్‌ ఇవ్వాలి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:31 AM

మే ఒకటో తేదీన ఇంటి వద్దనే వృద్ధులకు పింఛన్‌ ఇవ్వాలని బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇంటి వద్దనే పింఛన్‌ ఇవ్వాలి
మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ చేరిన వైసీపీ వర్గీయులు

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్ల్లె, ఏప్రిల్‌ 27: మే ఒకటో తేదీన ఇంటి వద్దనే వృద్ధులకు పింఛన్‌ ఇవ్వాలని బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం బనగానపల్లె పట్టణంలోని వేణుగోపాలయ్యతోట, నాలుగు స్తంభాల గుడి తదితర ప్రాంతాల్లో బీసీ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజాగళం కార్యక్రమంలో బీసీ మాట్లాడుతూ పింఛన్‌దారులకు ఇంటి వద్దనే పింఛన్‌ ఇవ్వాలని, సీఎం జగన్‌ కుట్రపూరితంగా ఇంటి వద్ద పంపిణీ చేయ కుండా రాజకీయ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు రూ.4వేల పింఛన్‌ ఇచ్చేలా చూస్తామని అన్నారు. జూలై నెలలో రూ.4వేలతో పాటు మరో రూ3వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువగళం పథకం ద్వారా 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి, యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి రూ.3వేలు నెలకు ఆర్థిక చేయూత ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు : కొలిమిగుండ్ల మండలం నాగి శెట్టిపల్లె గ్రామానికి చెందిన 20 కుటుంబాలవారు ఇటిక్యాల బాలిరెడ్డి ఆధ్వ ర్యంలో టీడీపీలో చేరారు. వైసీపీకి చెందిన వీరు శనివారం బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. కోరుమానుపల్లె గ్రామా నికి చెందిన సుంకర గోవర్థన్‌, సుంకర చిన్నకొండయ్య, గోవింద్‌, గణపరెడ్డి, సుబ్బయ్య, మల్లిఖార్జున తదతరులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి బీసీ జనార్దన్‌రెడ్డి టీడీపీ కండువాలు వేసీ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కోవెలకుంట్ల పట్టణంలోని వైసీపీకి చెందిన షేక్‌ నూర్‌మహమ్మద్‌, కోగిల మునీంద్ర, కంబగిరి, తెలుగు తిరుపాల్‌ శేఖర్‌, సుపీ మహ్మద్‌, అక్బర్‌బాషా తదితరులు టీడీపీలో చేరారు. అలాగే అబ్దుల్లాపురం కోరుమానుపల్లెకు చెం దిన పలువురు నాయకులు అంబటి జయలక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో దళిత నాయ కులు పోపులయ్య, సుందరయ్య తదితర కుటుంబాలు టీడీపీలో చేరాయి.

అవుకులో.. అవుకు పట్టణంలో శనివారం పత్తి నాగకులాయి ఆధ్వర్యంలో పలువురు మహిళలు టీడీపీలో బీసీ జనార్దన్‌రెడ్డి సమ క్షంలో టీడీపీలో చేరా రు. ఆయన వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ లో చేరిన వారిలో పత్తి చిన్నకు ళాయి, రామలక్ష్మమ్మ, సుభద్ర, దీక్షిత, కీర్తనకుమారి, రాజకుళా యి, కుమార్‌, పెద్దకులాయి. నారాయణ, మహేశ్వరి, గొడుగు నంది, పుల్లయ్య, పెద్దపుల్లయ్య, తుపాకుల వెంకటేశ్వర్లు ఉన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:31 AM