Share News

బాలకృష్ణ పర్యటన నబూతో నభవిష్యత్‌లా ఉండాలి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:43 PM

యువరత్న నందమూరి బాలకృష్ణ పర్యటన మర్రిపూడి చరిత్రలో నబూతో నభవిష్యత్‌లా ఉండేవిధంగా పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పిలుపునిచ్చారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నియంతపాలనకు అంతం పలికేందుకు ఓటర్లు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగనాసుర పరిపాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపు నిచ్చారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ మర్రిపూడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

బాలకృష్ణ పర్యటన నబూతో నభవిష్యత్‌లా ఉండాలి
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న దామచర్ల సత్య

మర్రిపూడి, ఏప్రిల్‌ 27 : యువరత్న నందమూరి బాలకృష్ణ పర్యటన మర్రిపూడి చరిత్రలో నబూతో నభవిష్యత్‌లా ఉండేవిధంగా పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పిలుపునిచ్చారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నియంతపాలనకు అంతం పలికేందుకు ఓటర్లు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగనాసుర పరిపాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపు నిచ్చారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ మర్రిపూడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సభకు దీటుగా బాలకృష్ణ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. గ్రామగ్రామాన టీడీపీ శ్రేణులు జాతరలో పాల్గొనేందుకు వచ్చే విధంగా తరలిరావాలన్నారు. మండలస్థాయి నాయకులు అన్ని గ్రామాల్లో పర్యటించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని కోరారు. ఎన్డీఏ తరుపున ఒంగోలు పార్లమెంటుకు పోటీచేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి, కొండపి శాసనసభ అభ్యర్ధి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామితోపాటు టీడీపీ అగ్ర నేతలు పాల్గొంటారని వెల్లడించారు. అంతకు ముందు పృథులగిరి రహదారి పక్కనే హెలిప్యాడ్‌ ఏర్పాటు చేసే స్థలాన్ని ఆయన పరిశీలించారు. బస్టాండ్‌ కూడలిలో రోడ్‌షో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నాయకులను కోరారు. సమావేశంలో తెలుగురైతు రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి యర్రమోతు శ్రీనివాసులు, టీడీపీ మండ అధ్యక్షుడు చేరెడ్డి నర్సారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త రేగుల వీరనారాయణ, జడ్పీటీసీ మాజీ సభ్యులు తుళ్ళూరి నరసింహారావ్‌, మండలపరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు గొంటు హనుమారెడ్డి, టీడీపీ నాయకులు బంగారయ్య, చేరెడ్డి నర్సారెడ్డి, వై. వెంకటరెడ్డి, సారెడ్డి యోగిరెడ్డి, బూదాల యోసుదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:43 PM