Share News

అంగన్‌వాడీలకు ఎన్నికల విధులు

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:13 AM

సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్‌ సిబ్బంది (ఓపీఎస్‌) కొరత ఏర్పడింది. ఇప్పటికే ఈ బాధ్యతల్లో నియమితులైన వారికి మొదటి విడత శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరిలో పలువురు వివిధ కారణాల వల్ల ఎన్నికల విధుల్లో ఉండలేమని విన్నవిస్తూ లేఖ లు రాశారు.

అంగన్‌వాడీలకు ఎన్నికల విధులు
పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు ఒంగోలు ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన అంగన్‌వాడీలు

జిల్లాలో పోలింగ్‌ సిబ్బంది కొరత

అవసరానికంటే 1,100 మంది తక్కువ

కార్యకర్తలు, కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం

వారి కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు కూడా పెంపు

ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 27 : సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్‌ సిబ్బంది (ఓపీఎస్‌) కొరత ఏర్పడింది. ఇప్పటికే ఈ బాధ్యతల్లో నియమితులైన వారికి మొదటి విడత శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరిలో పలువురు వివిధ కారణాల వల్ల ఎన్నికల విధుల్లో ఉండలేమని విన్నవిస్తూ లేఖ లు రాశారు. మరికొంత మంది అనారోగ్య సమస్యలు ఉన్నందున తమకు మినహాయింపు ఇవ్వాలని ఉన్నతాధి కారులను కలిసి వేడుకున్నారు. దీంతో పోలింగ్‌ సిబ్బంది కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు ఈసీ జిల్లా ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. అంగన్‌వాడీ కార్యకర్తలతోపాటు కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను అవసరమైన ప్రాంతాల్లో ఎన్నికల విధులకు వినియోగించుకోవాలని సూచించింది. తదనుగుణంగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిలో 1,100 మంది తక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, కాంట్రాక్టు ఉద్యోగులను పోలింగ్‌ విధులకు నియమించినట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం గడువును కూడా పెంచుతూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. తొలుత ప్రకటించిన ప్రకారం ఈనెల 26వతేదీతో పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు గడువు ముగిసింది. సిబ్బంది కొరత నేపథ్యంలో కొత్తవారిని నియమిం చాల్సి రావడంతో వచ్చేనెల 1వతేదీ వరకు గడువు పెంచింది. ఎన్నికల విధులకు నియమితులైన అంగన్‌వాడీ కార్యక ర్తలు, కాంట్రాక్టు ఉద్యోగులు నియో జకవర్గ కేంద్రాల్లోని రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో పోస్టల్‌ బ్యాలెట్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:13 AM