Share News

పేదలను ఆకలితో మాడ్చిన జగన్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:01 AM

పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను అధికారంలోకి రాగానే జగన్‌మోహన్‌ రెడ్డి రద్దు చేసి వారిని ఆకలితో మాడ్చాడని టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు.

పేదలను ఆకలితో మాడ్చిన జగన్‌

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 27 : పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను అధికారంలోకి రాగానే జగన్‌మోహన్‌ రెడ్డి రద్దు చేసి వారిని ఆకలితో మాడ్చాడని టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్‌టీసీ బస్టాండ్‌ వరకు, సాయంత్రం రాచర్ల గేటు వద్ద నుంచి మార్కెట్‌యార్డు వరకు ఆయన ప్రచారం నిర్వహించారు. రోడ్డుపక్కన చిరువ్యాపారాలు చేసే వ్యాపారులను కలుసుకుని వారి ఆర్థిక స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను వారికి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో గిద్దలూరు పట్టణంలో కూడా అన్నాక్యాంటీన్‌ నిర్వహించినట్లు ప్రజలకు వివరిం చారు. ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామన్నారు. పేదలకు సంక్షేమం అందించడం అంటే బటన్‌ నొక్కడమే కాదని వారి ఆకలిని తీర్చడం కూడా అని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నిత్యవసర సరుకులు, సిమెంట్‌, ఇసుక, గ్యాస్‌ధరలు పెంచడమే అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమం, అభివృద్ధి కుంటుపడింద న్నారు. తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో గిద్దలూరు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం గుండ్లమోటు నుంచి పైపులైన్‌ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించినట్లు పేర్కొన్నారు. రామన్నకతువ నుంచి పైపులైన్‌ ద్వారా పట్ట ణ ప్రజలకు తాగునీరు అందించేందుకు నాటి ముఖ్య మంత్రి రూ.100 కోట్లు నిధులను మంజూరు చేశాడ న్నారు. ఆ పనులు కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు అభివృద్ధిపై గాని, ప్రజా సంక్షేమంపై గాని దృష్టిపెట్టలేద న్నారు. తాను స్థానికుడినని, ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తనకు మద్దతుగా నిలిచి గిద్దలూ రు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు, పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివా సుల రెడ్డికి సైకిల్‌గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చంద్రశేఖర్‌ యాదవ్‌, లొక్కు రమేష్‌, గడ్డం భాస్కర్‌రెడ్డి, పాలు గుళ్ల శ్రీదేవి, బిల్లా జయ లక్ష్మి, కో-ఆప్షన్‌ సభ్యులు దమ్మాల జనార్థన్‌, పట్టణ పార్టీ అధ్యక్షులు షానేషా వలి, టీడీపీ నాయకులు బాలీశ్వరయ్య, ఓబయ్య, బిల్లా రమేష్‌, పాల్గొన్నారు.

టీడీపీలో 20 కుటుంబాల చేరిక

టీడీపీ పట్ల ఆకర్షితులై పట్టణంలోని 20 కుటుంబాలకు చెందిన ప్రైవేటు ఎలక్ట్రికల్‌ వర్కర్లు ఆ పార్టీలో చేరారు. వీరందరరికీ ఆ పార్టీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో షేక్‌ బడే, షేక్‌రషీద్‌, షేక్‌ షాకీర్‌, జి.అల్లూరయ్య, బి.భాస్కర్‌, షేక్‌ భాషా, పాండు, రవి, నాయక్‌, ప్రేమ్‌, సుబ్బరాయుడు, ఖాదర్‌భాషా, రసూల్‌, ప్రసాద్‌, రాజేష్‌, వెంకీ, మహబూబ్‌భాషా, ఖాశీం, ఖాజా, వలి ఉన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 02:01 AM