Share News

జగన్‌రెడ్డి మేనిఫెస్టో పచ్చి అబద్ధం

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:44 PM

జగన్‌రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో పచ్చి అబద్ధాలదని టీడీపీ కూ టమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. శనివారం మండలంలో ని రావినూతలల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. ఎమ్మె ల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్‌ను సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గొట్టిపాటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ మేనిఫెస్టో ఒత్తి అంకెల గారడీ, అబద్ధాలదని అన్నారు. గత ఎన్నికల్లో నవరత్నాల పథకాలతో వచ్చిన జగన్‌రెడ్డి ఐదేళ్లలో నవమోసాలతో నయవంచనకు పాల్పడ్డారని గొట్టిపాటి ధ్వజమెత్తారు.

జగన్‌రెడ్డి మేనిఫెస్టో పచ్చి అబద్ధం
రావినూతలలో గొట్టిపాటికి దిష్టి తీస్తున్న మహిళలు

నవరత్నాలతో నయవంచన

మళ్లీ పథకాలను నమ్మి మోసపోవద్దు

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి

మేదరమెట్ల, ఏప్రిల్‌ 27 : జగన్‌రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో పచ్చి అబద్ధాలదని టీడీపీ కూ టమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. శనివారం మండలంలో ని రావినూతలల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. ఎమ్మె ల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్‌ను సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గొట్టిపాటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ మేనిఫెస్టో ఒత్తి అంకెల గారడీ, అబద్ధాలదని అన్నారు. గత ఎన్నికల్లో నవరత్నాల పథకాలతో వచ్చిన జగన్‌రెడ్డి ఐదేళ్లలో నవమోసాలతో నయవంచనకు పాల్పడ్డారని గొట్టిపాటి ధ్వజమెత్తారు. మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. వైసీపీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పదెపదె మాయమాటలు చెప్పి అధికారంలోకి వ చ్చి ప్రజలను దోచుకోవాలని లక్ష్యంతో మేనిఫెస్టోను విడుదల చేశారన్నారు. గతంలో అమ్మఒడికి ఇచ్చిన మొత్తంలో రూ.2వేలు కోత పెట్టారన్నారు. రైతు భరోసా రూ.13,500 ఇస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ మొత్తాలను పెం చుతున్నట్లు ప్రకటించ డం మరోసారి మోసగించేందుకేనన్నారు. టీడీపీ, వైసీపీ మేనిఫెస్టోను, వాస్తవాలను ప్రజలు గుర్తిం చాలన్నారు. మద్యం నిషేధం చేసి ఓట్లు అడిగేందుకు వస్తానని చెప్పిన జగన్‌రెడ్డి నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు న్నారన్నారు. ఐదేళ్లలో 9 సార్టు కంరెట్‌ చార్జీలను పెంచారన్నారు. నిరుద్యోగులకు మెగా డిఎస్సీ విషయంలో మడమ తిప్పారన్నారు. అన్ని రం గాలలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. సాగు, తాగు నీరు, రోడ్లు, రవాణా సదుపాయాల కల్పనలో ఘోరంగా విఫలమయ్యారని దు య్య బట్టారు. ఎక్కడా రోడ్లు వేసిన పాపాన పోలేద న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిధులను దారి మళ్లించి ఆ వర్గాలను నిండా ముంచారన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా దాడులు, దౌర్జన్యాలు, దోపిడీ, అవినీతి పాలనతో సర్వనాశనం చేశారన్నారు. మరోసారి ఓటు వేసి ప్రజలు తప్పు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, ఉచిత బ స్సు ప్రయాణం, డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం, రూ.4వేల పింఛన్‌ వంటి పథకాలతో పేదలకు మే లు చేకూరుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవా లని, టీడీపీ కూటమి అ భ్యర్థులను అఖండ మెజా ర్టీతో గెలిపించి అసెంబ్లీకు పంపాలని గొట్టిపాటి విజ్ఞప్తి చే శారు. రావినూతలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు, మ హిళలు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:44 PM