Share News

అభివృద్ధిపై ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య తగాదా

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:31 PM

గ్రామాభివృద్ధిపై ప్రశ్నించినందుకు వైసీపీ కార్యకర్తలు, యువకుల మధ్య శనివారం కూర్మనాథ పురంలో తగాదా చోటుచేసుకుంది.

అభివృద్ధిపై ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య తగాదా
యువకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్న దువ్వాడ

సంతబొమ్మాళి: గ్రామాభివృద్ధిపై ప్రశ్నించినందుకు వైసీపీ కార్యకర్తలు, యువకుల మధ్య శనివారం కూర్మనాథ పురంలో తగాదా చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. టెక్కలి వైసీపీ అభ్య ర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ శనివారం సాయంత్రం నౌపడ పంచాయతీ కూర్మనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వస్తుండగా గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు నర్సింగరావు, ధర్మారావు అదే గ్రామానికి చెందిన యువకులు సింహాచలం, సాయికుమార్‌ మధ్య గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులపై వాగ్వాదం సంభవించింది. ఎన్నికల ప్రచారానికి రావాలని యువకులను వెసీపీ కార్యకర్తలు కోరారు. గ్రామానికి మీరేం అభివృద్ధి చేశారని ప్రచారానికి వస్తున్నారని, మా గ్రామానికి అచ్చెన్నాయుడు రోడ్డు వేశారని సదరు యువకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనలో వైసీ పీ కార్యకర్త నర్సింగరావుకు ముఖం పై చిన్నపాటి గాయమైంది. దీంతో విషయం తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్‌ తన అనుచరులతో అక్కడికి చేరుకుని బాధ్యు లైన యువకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎస్‌ఐ కిశోర్‌వర్మ అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. దాడి చేసిన యువకులను నౌపడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై నౌపడ ఎస్‌ఐ కిషోర్‌ వర్మ మాట్లాడుతూ దాడికి పాల్పడిన యువ కులను అదుపులోకి తీసుకున్నా మని, మెడికల్‌ రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:31 PM