Share News

పెద్ద నోటు - ఈసారి లోటు

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:51 PM

ఎన్నికలొచ్చాయంటే నగదు, మద్యానిదే కీలక భూమిక. నోటిఫికేషన్‌ మొదలు ఓటరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే వరకూ ఈ రెండే ప్రభావం చూపిస్తుంటాయి. ఓటర్లను దారి లోకి తెచ్చుకోవాలన్నా.. ఫిరాయింపులు అడ్డుకోవాలన్నా వీటి అవసరం అంతా ఇంతా కాదు. జేబులో చేయి పెట్టి నోటు తీస్తే కట్టంతా ఇవ్వాలని అడిగే రోజులివి. అభ్యర్థుల అదృష్టమో.. ఓటరు దురదృష్టమో తెలియదు గానీ ఈ ఎన్నికల్లో పెద్ద నోట్లు కనిపించకుండా పోయాయి. 2014 సాధారణ ఎన్నికల్లో పెద్ద నోటు అంటే వెయ్యి ఒక్కటే. ఆ తరువాత నోట్ల రద్దుతో వెయ్యి నోటు అడ్రస్‌ లేకుండా పోయింది. 2019 ఎన్నికల నాటికి రూ.2 వేల నోటు వచ్చింది. ఇప్పుడు అదీ కనిపించడం లేదు. జేబులోకి చెయ్యి పోనిస్తే రూ.500 నోటు లేదా రూ.200 నోటు పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఓటరుకైనా, నాయకుడికైనా పెద్ద నోటు ప్రస్తుతానికి ఇదే. అలాగని ఒకటో, రెండో నోట్లు ఇచ్చినా ఓటరు సంతృప్తి పడే రోజులు పోయాయని అభ్యర్థులు ఇప్పుడు పెద్ద నోట్ల వేటలో పడ్డారు.

పెద్ద నోటు - ఈసారి లోటు

గార: ఎన్నికలొచ్చాయంటే నగదు, మద్యానిదే కీలక భూమిక. నోటిఫికేషన్‌ మొదలు ఓటరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే వరకూ ఈ రెండే ప్రభావం చూపిస్తుంటాయి. ఓటర్లను దారి లోకి తెచ్చుకోవాలన్నా.. ఫిరాయింపులు అడ్డుకోవాలన్నా వీటి అవసరం అంతా ఇంతా కాదు. జేబులో చేయి పెట్టి నోటు తీస్తే కట్టంతా ఇవ్వాలని అడిగే రోజులివి. అభ్యర్థుల అదృష్టమో.. ఓటరు దురదృష్టమో తెలియదు గానీ ఈ ఎన్నికల్లో పెద్ద నోట్లు కనిపించకుండా పోయాయి. 2014 సాధారణ ఎన్నికల్లో పెద్ద నోటు అంటే వెయ్యి ఒక్కటే. ఆ తరువాత నోట్ల రద్దుతో వెయ్యి నోటు అడ్రస్‌ లేకుండా పోయింది. 2019 ఎన్నికల నాటికి రూ.2 వేల నోటు వచ్చింది. ఇప్పుడు అదీ కనిపించడం లేదు. జేబులోకి చెయ్యి పోనిస్తే రూ.500 నోటు లేదా రూ.200 నోటు పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఓటరుకైనా, నాయకుడికైనా పెద్ద నోటు ప్రస్తుతానికి ఇదే. అలాగని ఒకటో, రెండో నోట్లు ఇచ్చినా ఓటరు సంతృప్తి పడే రోజులు పోయాయని అభ్యర్థులు ఇప్పుడు పెద్ద నోట్ల వేటలో పడ్డారు.

Updated Date - Apr 27 , 2024 | 11:51 PM