Share News

‘ఆత్మీయత’ ఓ నాటకం!

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:52 PM

అనుబంధం.. ఆత్మీయత...అంతా ఓ బూటకం’ అన్నాడో సినీ కవి. అనుబంధం సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుత ఎన్నికల సమయంలో ‘ఆత్మీయత’ మా త్రం ఓ నాటకమే నన్నది అక్కడక్కడా చోటుచేసుకుంటున్న ‘రాజకీయ’ సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఈ మాటల్లో నిజమెంతో తెలియాలంటే... ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఎత్తుగడలు చూస్తే చాలు. ఓవైపు అభ్యర్థి ఖర్చులపై ఎన్నికల కమిషన్‌ నిఘా...మరోవైపు పైసలు తీయకపోతే ‘కార్యకర్తలు’ కరువైపోయే పరిస్థితి. ఇది పోటీలో ఉన్న వారికి మింగుడు పడ డం లేదు. అందుకే తాజాగా నాయకులు ‘ఆత్మీయ సమావేశాల’ను ఎంచుకుంటున్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమతో వస్తున్న కార్యకర్తలందరికీ మద్యం, బిర్యాని, డబ్బులు ఇచ్చేందుకు పుట్టిన రోజులు, పెళ్లి రోజులు అని చెప్పి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో నాయకులు తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. అనంతరం కార్యకర్తలందరికీ మద్యం, బిర్యాని, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇది ఎన్నికల వ్యయం కింద రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

‘ఆత్మీయత’ ఓ నాటకం!

రణస్థలం: అనుబంధం.. ఆత్మీయత...అంతా ఓ బూటకం’ అన్నాడో సినీ కవి. అనుబంధం సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుత ఎన్నికల సమయంలో ‘ఆత్మీయత’ మా త్రం ఓ నాటకమే నన్నది అక్కడక్కడా చోటుచేసుకుంటున్న ‘రాజకీయ’ సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఈ మాటల్లో నిజమెంతో తెలియాలంటే... ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఎత్తుగడలు చూస్తే చాలు. ఓవైపు అభ్యర్థి ఖర్చులపై ఎన్నికల కమిషన్‌ నిఘా...మరోవైపు పైసలు తీయకపోతే ‘కార్యకర్తలు’ కరువైపోయే పరిస్థితి. ఇది పోటీలో ఉన్న వారికి మింగుడు పడ డం లేదు. అందుకే తాజాగా నాయకులు ‘ఆత్మీయ సమావేశాల’ను ఎంచుకుంటున్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమతో వస్తున్న కార్యకర్తలందరికీ మద్యం, బిర్యాని, డబ్బులు ఇచ్చేందుకు పుట్టిన రోజులు, పెళ్లి రోజులు అని చెప్పి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో నాయకులు తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. అనంతరం కార్యకర్తలందరికీ మద్యం, బిర్యాని, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇది ఎన్నికల వ్యయం కింద రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:52 PM