Share News

మద్యం, డబ్బు అక్రమ రవాణాపై నిఘా పెట్టండి

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:20 AM

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపఽథ్యంలో మద్యం, డబ్బు అక్రమంగా తరలించే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిని నివారించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు నవీన్‌కుమార్‌ సోని సూచించారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు.

మద్యం, డబ్బు అక్రమ రవాణాపై నిఘా పెట్టండి
ఇచ్ఛాపురం: రికార్డులను పరిశీలిస్తున్న ఎన్నికల వ్యయ పరిశీలకుడు నవీన్‌కుమార్‌ సోని

ఇచ్ఛాపురం: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపఽథ్యంలో మద్యం, డబ్బు అక్రమంగా తరలించే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిని నివారించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు నవీన్‌కుమార్‌ సోని సూచించారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్ఛాపురం నియోజక వర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో ఇంతవరకు ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు, వాటి ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ ఎస్‌టీ, అకౌంటింగ్‌, వ్యయపరిశీలన బృందాలతో సమావేశమై సూచన లిచ్చా రు. కార్యక్రమంలో ఆర్వో సుదర్శన్‌ దొర, ఎలక్షన్‌ డీటీ శ్రీహరి పాల్గొన్నారు.

నామినేషన్‌ కేంద్రం పరిశీలన

పలాస: పలాస తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకుడు నవీన్‌ కుమార్‌ సోని శుక్రవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా పలాస ఎన్నికల అధికారి, ఆర్డీవో భరత్‌ నాయక్‌తో చర్చించారు. ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, వారి వ్యయ వివ రాలు అడిగి తెలుసుకున్నారు. పలాస, టెక్కలి, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు సంబంధించి నవీన్‌ కుమార్‌ సోని ఎన్నికల వ్యయపరిశీ లకుడిగా వ్యవహరిస్తున్నారు.

నిష్పక్షపాతంగా లెక్కింపు చేపట్టాలి

నరసన్నపేట: రాజకీయ పార్టీలు నామినేషన్‌, ప్రచారంలో వినియోగించే జెండాలు, వాహ నాల ఖర్చులను నిష్పక్షపాతంగా లెక్కించాలని పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు శరవణ్‌ కుమార్‌ సూచించారు. శుక్రవారం నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమం లో ఆర్వో రామ్మోహన్‌రావు, ఏఆర్వో కనకారావు పాల్గొన్నారు.

శ్రీకాకుళం క్రైం: శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు కేకే శరవణకుమార్‌ను ఎస్పీ జీఆర్‌ రాధిక మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎస్పీ పుష్పగుచ్ఛం ఇచ్చిస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎన్నికల సన్నద్ధతపై వారు చర్చించారు.

టెక్కలి: టెక్కలి నియోజక వర్గ ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు అబ్జ ర్వర్‌ నవీన్‌కుమార్‌ సోనీ శుక్రవారం సాయంత్రం సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సంద ర్భంగా ఆర్వో నూరుల్‌ కమర్‌తో మాట్లాడుతూ.. వ్యయ పరిశీలన పారదర్శ కంగా ఉండాలని, పటిష్ఠ నియంత్రణ చర్యలు చేప ట్టాలన్నారు. ఏఆర్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగం గా వివిధ విభాగాల పనితీరు పక్కాగా ఉండాలని, తప్పిదాలు జరగకూడదని ఆర్వో నూరుల్‌కమర్‌ అన్నారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో నియోజకవర్గ వ్యయ పరిశీలకులైన కె.కుమారస్వామి, ఎస్‌.రమేష్‌, ఎస్‌వీఎన్‌ ప్రసాద్‌ లతో ఆయన చర్చించారు. వీడియో ఫ్లయింగ్‌ బృందానికి సూచనలు చేశారు.

Updated Date - Apr 20 , 2024 | 12:20 AM