Share News

వీధుల్లో మైక్‌లు.. ఇళ్లల్లో సెల్‌ ఫోన్లు

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:55 PM

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తికావడంతో ప్రచారంపై రాజకీయ పార్టీలు దృష్టిసారించాయి. గతానికి భిన్నంగా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. వీధుల్లో మైక్‌లతో హోరెత్తిస్తుండగా, ఇళ్లలో ఉండే సెల్‌ఫోన్లకు అభ్యర్థులు ఫోన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికావడం, స్మార్ట్‌ఫోన్లు ప్రతి ఇంటా ఉండడంతో అభ్యర్థులు వాట్సాప్‌ ద్వారా ప్రతి అంశం షేర్‌ చేస్తున్నారు. తమకు ఓటు వేస్తే చేయబోయే అంశాలను ఐవీఆర్‌ ద్వారా వివరిస్తున్నారు. వారంరోజులుగా ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల తరపున ఆయా పార్టీల మద్దతుదారులు, పార్టీ కార్యాలయాల ప్రతినిధులు ఫోన్‌చేసి వచ్చే నెల 13న జరిగే పోలింగ్‌లో తమ అభ్యర్థికి ఓటు వేయాలని పదేపదే కోరుతున్నారు. దీనివల్ల ఫోన్‌రింగ్‌ అవుతున్న సమయంలో లిఫ్ట్‌ చేసేందుకు చాలామంది ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. గుర్తుతెలియని నంబరు నుంచి ఫోన్‌ వస్తే లిఫ్ట్‌ చేయడానికి ఇష్టపడడం లేదు. బంధువులు, స్నేహితులు పను లపై చేసే సమయంలో కూడా ఈ నెంబరు ఎవరిదోనని తికమకప డుతున్నారు. ప్రశాంతతను కోరుకునే గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంటారు. కొద్దిరోజులుగా ఎక్కువ సార్లు ఫోన్లు వస్తుండడంతో విసుగు చెందుతున్నారు.

వీధుల్లో మైక్‌లు.. ఇళ్లల్లో సెల్‌ ఫోన్లు

(వజ్రపుకొత్తూరు)

Updated Date - Apr 27 , 2024 | 11:55 PM