Share News

సోంపేట నియోజకవర్గం కనుమరుగు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:53 PM

నాలుగు దశాబ్దాలపాటు నియోజకవర్గంగా కొనసాగిన సోంపేట 2009లో పునర్విభజనలో కనుమరుగైంది. ఇక్కడి నుంచి పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు గౌతు లచ్చన్న ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే గెలుపొందారు. 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో లచ్చన్న విజయం సాధించారు. ఆయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ కూడా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. వీరే కాకుండా మజ్జి తులసీదాస్‌ ఒకసారి, మజ్జి నారాయణరావు రెండేళ్ల పాటు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజ కవర్గాల డిలిమిటేషన్‌లో భాగంగా 2009 సోంపేటను రద్దు చేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో సోంపేట, మందస, పలాస మండలాలు ఉండేవి. సోంపేట మండలాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కలపగా, పలాస, మందసను కలిపి పలాస నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. పునర్విభజన తర్వాత సోంపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన శివాజీ పలాసలో 2009లో పోటీచేశారు.

సోంపేట నియోజకవర్గం కనుమరుగు
సోంపేట పట్టణం:

సోంపేట: నాలుగు దశాబ్దాలపాటు నియోజకవర్గంగా కొనసాగిన సోంపేట 2009లో పునర్విభజనలో కనుమరుగైంది. ఇక్కడి నుంచి పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు గౌతు లచ్చన్న ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే గెలుపొందారు. 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో లచ్చన్న విజయం సాధించారు. ఆయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ కూడా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. వీరే కాకుండా మజ్జి తులసీదాస్‌ ఒకసారి, మజ్జి నారాయణరావు రెండేళ్ల పాటు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజ కవర్గాల డిలిమిటేషన్‌లో భాగంగా 2009 సోంపేటను రద్దు చేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో సోంపేట, మందస, పలాస మండలాలు ఉండేవి. సోంపేట మండలాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కలపగా, పలాస, మందసను కలిపి పలాస నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. పునర్విభజన తర్వాత సోంపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన శివాజీ పలాసలో 2009లో పోటీచేశారు.

Updated Date - Apr 19 , 2024 | 11:53 PM