Share News

తొలి ఎన్నికల్లో ఏమైందంటే..

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:54 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం అనంతరం 1957లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు రాష్ట్రంలో 55,61,345 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా... 36,03,585 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. మరి ఇప్పుడో...ఈ ఓటర్ల సంఖ్య ఒక జిల్లా ఓటర్లతో సమానం.. నాటికీ నేటికీ ఎంత తేడా. 1957లోని మరికొన్ని విశేషాల సమాహారం కొత్తతరం ఓటర్ల కోంం..

తొలి ఎన్నికల్లో ఏమైందంటే..

(నరసన్నపేట)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం అనంతరం 1957లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు రాష్ట్రంలో 55,61,345 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా... 36,03,585 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. మరి ఇప్పుడో...ఈ ఓటర్ల సంఖ్య ఒక జిల్లా ఓటర్లతో సమానం.. నాటికీ నేటికీ ఎంత తేడా. 1957లోని మరికొన్ని విశేషాల సమాహారం కొత్తతరం ఓటర్ల కోంం..

ఫ 1957లో ఏపీలో 85 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఫ రాష్ట్ర వ్యాప్తంగా 47.67 శాతం పోలింగ్‌ నమోదైంది..

ఫ మొదటి అసెంబ్లీ నియోజకవర్గంగా కల్వకుర్తి, చివరి అసెంబ్లీ నియోజకవర్గంగా దేవరకొండ ఉండేవి.

ఫ రాష్ట్ర వ్యాప్తంగా 493 మంది నామినేషన్లు వేయ గా... వాటిలో 174 తిరస్కరణకు గురయ్యాయి. ఒక్కరు కూడా నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు.

ఫ పోటీ చేసిన 319 మంది అభ్యర్థులలో 81 మంది డిపాజిట్లు కోల్పోయారు.

ఫ రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది మహిళలు పోటీ చేయగా... వారిలో ఏడుగురు విజయం సాధించారు.

ఫ మూడు నియోజకవర్గాల్లో ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే ఎన్నికల బరిలో ఉండడంతో వారు ఏకగ్రీవంగా శాసనసభ్యులయ్యారు.

ఫ 18 నియోజకవర్గాలలో ఇద్దరేసి అభ్యర్థులు పోటీ చేశారు. 25 స్థానాలలో ముగ్గురేసి, 21 స్థానాలలో నలుగురేసి, మూడుస్థానాలలో అయిదుగురు, 15 స్థానాలలో ఆరు నుంచి పదిమంది ఎన్నికల బరిలో పోటీచేశారు.

ఫ కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో) నియోజకవర్గం నుంచి అత్యధికంగా పదిమంది అభ్యర్థులు పోటీ చేశారు.

ఫ మొత్తం 85 నియోజకవర్గాలలో 18 స్థానాలు ఎస్సీలకు, రెండు స్థానాలు ఎస్టీలకు కేటాయించారు.

ఫ కాంగ్రెస్‌కు 47.38 శాతం ఓట్లు పడ్డాయి. ప్రజా సోషలిస్ట్‌ పార్టీకి 5.65 శాతం, భారతీయ జనసంఘ్‌కు కేవలం 0.16 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రాంతీయ పార్టీ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌కు 36.46 శాతం ఓట్లు వచ్చాయి.

Updated Date - Apr 27 , 2024 | 11:54 PM