Share News

జిలాల్లో 7,71,193 మంది ఓటర్లు

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:18 AM

జిల్లాలో తుది ఓటరు జాబితాను అధికారులు శనివారం ప్రకటించారు. జిల్లాలోని 22 మండలాల్లో పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7 లక్షల 71 వేల 193 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 3,71,120 మంది, మహిళలు 4,00,034 మంది, ఇతరులు 39 మంది ఉన్నారు.

జిలాల్లో 7,71,193 మంది ఓటర్లు

- తుది ఓటరు జాబితా ప్రకటన...ఈ ఓటర్లతోనే సార్వత్రిక ఎన్నికలు

- పురుషులు: 3,71,120 మంది

- మహిళలు: 4,00,034 మంది

- ఇతరులు: 39 మంది

- ఈ ఏడాది జనవరి 22 నుంచి ఇప్పటికి 9.938 మంది పెరుగుదల

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో తుది ఓటరు జాబితాను అధికారులు శనివారం ప్రకటించారు. జిల్లాలోని 22 మండలాల్లో పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7 లక్షల 71 వేల 193 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 3,71,120 మంది, మహిళలు 4,00,034 మంది, ఇతరులు 39 మంది ఉన్నారు. జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 48 వేల 887 మంది ఓటర్లు కాగా, వారిలో పురుషులు 1,19,790 మంది, మహిళలు 1,28,581 మంది, ఇతరులు 16 మంది ఓటర్లున్నారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మ్తొతం 2 లక్షల 45 వేల 489 మంది ఓటర్లలో పురుషులు 1,19,429 మంది, మహిళలు 1,26,053 మంది, ఇతరులు 7 మంది ఓటర్లున్నారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 77 వేల 317 మంది ఓటర్లులో పురుషులు 1,31,901 మంది, మహిళలు 1,45,400 మంది, ఇతరులు 16 మంది ఓటర్లున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,021 పోలింగ్‌ కేంద్రాలు కాగా, వాటిలో పాడేరు నియోజకవర్గంలో 318, అరకులోయలో 304, రంపచోడవరంలో 399 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.

గత ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 1,20,228 మంది...

జిల్లాలో గత ఐదేళ్లలో 1,20,228 మంది ఓటర్లు పెరిగారు. 2019లో జరిగిన సార్వత్రి ఎన్నికల సమయానికి జిల్లాలో మొత్తం 6 లక్షల 50 వేల 965 మంది ఓటర్లుండగా, తాజాగా వెల్లడించిన తుది జాబితా ప్రకారం 7 లక్షల 71 వేల 193 మంది ఓటర్లున్నారు. అంటే అదనంగా ఒక లక్షా 20 వేల 228 మంది ఓటర్లు పెరిగారు.

సంవత్సరం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

2019 3,16,933 1,34,011 21 6,50,965

2024 3,71,120 4,00,034 39 7,71,193

పెరిగిన ఓటర్లు 9,938 మంది..

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటర్ల వివరాలతో ఈ ఏడాది జనవరి 22న అధికారులు తుది జాబితాలను విడుదల చేసేటప్పటికి జిల్లాలో 7 లక్షల 61 వేల 255 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 3,66,386 మంది, మహిళలు 3,94,832 మంది, ఇతరులు 37 మంది ఉన్నారు. జనవరి 22 తేదీ నుంచి ఈ నెల 14 తేదీ వరకు నిర్వహించిన ఓటరు నమోదు ప్రక్రియలో కొత్తగా 4,734 మంది పురుషులు, 5,202 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు కలిసి మొత్తం 9,938 మంది ఓటర్లు పెరిగారు.

Updated Date - Apr 28 , 2024 | 01:18 AM