Share News

ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:14 AM

అధిక ఎండలు కారణంగా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఉందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి తెర్లి జగన్మోహన్‌రావు అన్నారు.

ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి

గరుగుబిల్లి: అధిక ఎండలు కారణంగా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఉందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి తెర్లి జగన్మోహన్‌రావు అన్నారు. మండలంలోని సన్యాసిరాజుపేట, పెదగుడబ, చినగుడబ గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించారు. ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ జ్వర లక్షణాలు ఉన్నట్లయితే స్థానిక సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. వైద్య సిబ్బంది విధిగా జ్వరాలపై ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆయన ఆదేశించారు. వేసవిలో తలెత్తే సమస్యలపై అవగాహన కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సచివాలయాల పరిధిలోని సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి వైద్యాధికారులు కేకే సాగర్‌వర్మ, ఎస్‌.సంతోష్‌కుమార్‌, ఈవో సత్తిబాబు, సిబ్బంది రమణమ్మ, ఇంద్రాణి, రమేష్‌, 104 సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:14 AM