Share News

నామినేషన్ల షురూ

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:59 PM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం కలెక్టర్‌ నాగలక్ష్మికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, జనసేన రాష్ట్ర నాయకులు యశస్విని, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రెడ్డి పావని ఉన్నారు.

నామినేషన్ల షురూ
ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్న కలిశెట్టి అప్పలనాయుడు, పక్కన అశోక్‌గజపతిరాజు

నామినేషన్ల షురూ

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం కలెక్టర్‌ నాగలక్ష్మికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, జనసేన రాష్ట్ర నాయకులు యశస్విని, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రెడ్డి పావని ఉన్నారు. తెలుగుదేశం రాజాం అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ శుక్రవారం రాజాం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జోసెఫ్‌కు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆయన వెంట తూర్పుకాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కొల్ల అప్పలనాయుడు, వంగర మండల టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీపీ బొత్స వాసుదేవరావు నాయుడు ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నాయకురాలు లోకం నాగమాధవి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి ఎం.నూకరాజుకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ అందజేశారు. ఆమె వెంట టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, సీనియర్‌ నాయకుడు సువ్వాడ రవిశేఖర్‌, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ కూడా శుక్రవారమే నామినేషన్‌ దాఖలు చేశారు. డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఎస్వీ రమణరాజు, నాయకులు మీసాల వరహాలనాయుడు, కుమార్తె అనూష, సోదరితో కలిసి వచ్చి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు శుక్రవారం మూడు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి ఎ.సాయిశ్రీకి అందజేశారు.

Updated Date - Apr 19 , 2024 | 11:59 PM