Share News

సాలూరును ఏం అభివృద్ధి చేశారు?

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:09 AM

సుమారు 18ఏళ్లు ఎమ్మెల్యేగా, రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉండి సాలూరు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి.. ఉపముఖ్యమంత్రి రాజన్నదొరను ప్రశ్నించారు.

 సాలూరును ఏం అభివృద్ధి చేశారు?

సాలూరు: సుమారు 18ఏళ్లు ఎమ్మెల్యేగా, రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉండి సాలూరు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి.. ఉపముఖ్యమంత్రి రాజన్నదొరను ప్రశ్నించారు. శుక్రవారం సాలూరులో నామినేషన్‌ సమర్పించిన అనంతరం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. స్థానిక వైసీపీ నేత సుమారు 18ఏళ్లగా పదవిలో ఉండి సాలూరుకు, సాలూరు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ సంధ్యారాణి ఒక సెట్‌ నామినేషన్‌ ముహూర్తం ప్రకారం వేశారని, ఈనెల 25న పార్టీ శ్రేణులతో కలిసి మళ్లీ మరో సెట్‌ నామినేషన్‌ వేస్తారని తెలిపారు. అనంతరం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. సాలూరు మండలం అన్నంరాజువలస పంచాయతీ పందిరిమామిడివలస, కుద్దాడవలస, చీపురువలస తదితర గ్రామాల్లో కూటమి అభ్యర్థి సంధ్యారాణి శుక్రవా రం ప్రచారం నిర్వహించారు. ఆముదాల పరమేశు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:09 AM