యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:14 AM
కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది.
బాడంగి: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఆనవరం గ్రామా నికి చెందిన తూముల విజయ్‌కుమార్(23) మూడు సంవత్సరాలుగా కడుపునొ ప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని చికిత్సలు తీసుకున్నా కడుపునొప్పి తగ్గకపోవ డంతో విరక్తి చెంది గురువారం ఉదయం గ్రామ సమీపంలోని అరటితోటలో పు రుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మృతు డి సోదరుడు, స్నేహితులు బొబ్బిలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరు గైన వైద్యం నిమిత్తం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి తూముల కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఆర్.జయంతి తెలిపారు.