Share News

నియంత జగన్‌ పాలనలో రాష్ట్రం విధ్వంసం

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:33 AM

రాష్ట్రంలో ఆరాచక పాలనను అంతమొం దించటానికే కూటమి ఏర్పడిం దని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు.

నియంత జగన్‌ పాలనలో రాష్ట్రం విధ్వంసం
విలేకరులతో మాట్లాడుతున్న బడేటి చంటి

ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి చంటి

ఏలూరుటూటౌన్‌, ఏప్రిల్‌ 27: రాష్ట్రంలో ఆరాచక పాలనను అంతమొం దించటానికే కూటమి ఏర్పడిం దని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. బడేటి క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వైసీపీ అరాచక పాలనపై ఎన్‌డీఏ కూటమి చార్జిషీటు దాఖలు చేసిందన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి రాగానే అరాచక పాలనపై చర్యలుంటాయన్నారు. నియంత జగన్‌ పెత్తందారి పాలనలో రాష్ట్రం విధ్వంసమైందన్నారు. రోజురోజుకు అక్రమ అరెస్టులు, అక్రమకేసులు ఎక్కువయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లపై దాడులు అధికమయ్యాయన్నారు. రాష్ట్రంలో ఐపీసీ కోడ్‌ను వైసీపీ కోడ్‌గా మార్చారన్నారు. మహిళల మిస్సింగ్‌ కేసులు రాష్ట్రంలోనే ఎక్కువని కేంద్ర నిఘా సంఘాలు తేల్చాయన్నారు. మూడు రాజధానుల పేరుతో జగన్‌ ప్రజలను మోసం చేశాడని. జగన్‌ ప్రకటించిన మేనిఫెస్టోలో ఏమిలేదన్నారు.

ఫ ఏలూరు 45వ డివిజన్‌లో ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరిగి జగన్‌ ఆరాచకాలను వివరిం చటంతో పాటు చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుత ఎమ్మెల్యే నాని చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. జనసేన ఇన్‌ఛార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు, ఎంఆర్‌డీ బలరామ్‌, కొట్టు మనోజ్‌, శివప్రసాద్‌, నాగిరెడ్డి, కాశీనరేష్‌, మల్లెపురాము, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:33 AM