Share News

ఎందుకిలా!

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:45 AM

ఎందుకిలా... ఒక నిర్దిష్ట నిర్ణయం జరిగిన తర్వాత పదే పదే అవాం తరాలు ఎందుకు తలెత్తున్నాయి. కేడర్‌లో గజిబిజికి దారితీస్తున్న పరిస్థితులు ఏమిటి. సీనియర్లు కాదంటున్నా త్యాగం పేరిట తప్పట్లేదా

ఎందుకిలా!

గోదావరి తీరాన తొలిసారి మారిన సీను

రోజుకోసారి మార్పు చేర్పులతో టెన్షన్‌

అభ్యర్థిత్వాలు ఖరారైన తర్వాతా గందరగోళం

ఈసారి అన్ని పార్టీల్లోను సయోధ్య లోపం

అభ్యర్థులు, కేడర్‌కు మానసిక శాంతి కరువు

ఆద్యం పోస్తున్న సోషల్‌ మీడియా

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

ఎందుకిలా... ఒక నిర్దిష్ట నిర్ణయం జరిగిన తర్వాత పదే పదే అవాం తరాలు ఎందుకు తలెత్తున్నాయి. కేడర్‌లో గజిబిజికి దారితీస్తున్న పరిస్థితులు ఏమిటి. సీనియర్లు కాదంటున్నా త్యాగం పేరిట తప్పట్లేదా.. అన్నింటి కంటే మించి నామి నేషన్లకు ముందు కూడా ఎందుకీ సందిగ్ధం, మరెందుకీ సందేహాలు. ఒకప్పుడు రాజకీయా ల్లో ముక్కుసూటితనం ఉండేది. రానురాను ప్రత్యర్థి ఎత్తుగడకు దీటుగా మార్పులు, చేర్పులు చేస్తుండడమే ఈ ఎన్నికల్లో రోజు తలెత్తున్న సస్పెన్షన్‌.

చాన్నాళ్ల్ల క్రితం ఏలూరు ఎంపీ స్థానం ఎవరికి కేటా యించబోతున్నారంటూ దాదాపు మూడు వారాలకు పైగానే అందరిని గందరగోళంలోకి నెట్టింది. జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సొంత నియోజకవర్గమైన ఉంగుటూరు పొత్తులో భాగంగా గన్ని చేజారుతుందా.. అంటూ మరికొన్నాళ్ల పాటు సోషల్‌ మీడియాలో పుంఖాను పుంఖాలుగా సందేహా లకు దారి తీసింది. ఆ తర్వాత నూజివీడులో సీటు ఎవరి కంటూ మరో సస్పెన్షన్‌. ఇదంతా కూటమిలో భాగస్వాములైన పార్టీల మధ్య నామినేషన్ల ముందు వరకు సాగిన వ్యవహారం కేడర్‌ను కదిలించింది. మరోవైపు వైసీపీ పక్షాన ఇలాంటి జాతరే. ఏలూరులో ప్రస్తుత సిట్టింగ్‌ను కాదని వేరొకరికి అవకాశం ఇస్తారా, చింతలపూడిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే తిరుగు బాటుతో ఆ పార్టీ నాయకత్వం కాస్తంతైనా తలొగ్గకపోతుందా... పోలవరంలో ప్రకటించిన అభ్యర్థి కుల వివాదంతో తలెత్తిన వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందా. ఇలాంటి సందేహాలెన్నో

రోజుల తరబడి ఆయా నియోజక వర్గాల్లో సెగలు పొగలు సృష్టిం చాయి. ప్రత్యేకించి ఈసారి ఆరునూరైనా సరైన విజయం తమ వైపే ఉండాలనే ఆకాంక్ష, నిరంతరం సాగిన సర్వేలు, సీట్ల సర్దుబాటు పేరిట కూటమిలో ఉమ్మడి త్యాగాలకు సిద్ధపడడం వంటి పరిణామాలన్నీ కలబోసి కొన్నాళ్ల పాటు అనిశ్చితికి దారితీసింది.

కూటమికి బాలారిష్టాలు

సాధారణంగా గడిచిన రెండు సాధా రణ ఎన్నికల్లో ఈ పరిస్థితి లేదు. ప్రత్యే కించి ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో టీడీపీకి స్పష్టత ఉండేది. ఒక్క వైసీపీలోనే వ్యవహారం ఊగిస లాడేది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మధ్య సమతూకానికి ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నించినప్పుడు ఈ సమస్యే కాకుండా అంతర్గత వివాదాలు చోటు చేసుకునేవి. కానీ మునుపెన్నడూ లేనివిధంగా అధికార వైసీపీని ఓటమి పాలు చేయాల్సిందేనని సంకల్పబలంతో ముందుకొచ్చిన కూటమి కొంత బాలరిష్టాల ను ఎదుర్కొంది. తప్పు ఒప్పు లను సవరించుకుని ఏ వైరుధ్యం లేకుండా ఉమ్మడి విజయమే ఆకాంక్షగా అడుగు లేస్తోంది. పోలవరం నియోజకవర్గంలో పొత్తుల్లో భాగంగా జనసేనకు సీటును కేటాయించారు. ఆది నుంచి ఇది కొందరికి మింగుడు పడక పోవడం, ఇంకొందరికి ఉత్సాహాన్ని ఇచ్చింది. పరస్పర సమన్వయంతో చర్చించుకోవా ల్సిందే తప్ప వీధిన పడితే సహించేదే లేదని కూటమిలో అందరికి ముందస్తు హెచ్చరికలే పంపారు. రానురాను సర్దుకుపోయే గుణం చూపించారు. మళ్లీ తిరిగి అక్కడ వ్యవహారం మొదటికొచ్చింది. ఏవో కారణాలతో పరస్పరం నిందించుకోవడం, రగిలిపోవడం వంటి చర్యలకు దిగారు. ఇదే తరుణంలో పోలవరం వైసీపీ అభ్యర్థి కుల వ్యవహారం న్యాయస్థానం ముందుకు వెళ్లింది. ఆ పార్టీ అభ్యర్థి తప్పుడు కుల ధ్రువీకరణ పంపారంటూ అది ఏమాత్రం చెల్లదని సవాలు చేస్తూ కొందరు కోర్టు గడప తొక్కారు. దాదాపు పక్షం రోజుల పాటు తీవ్ర అలజడికి దారితీసింది. ఈ మధ్యేనే ఆ వ్యవ హారం న్యాయ స్థానంలో విచారణకొచ్చి వాయిదా పడడంతో వైసీపీ కాస్త ఊపిరి పీల్చుకుంది.

ఏలూరు ఎంపీ స్థానంలోను..

ఏలూరు ఎంపీ స్థానంలోనూ ఇదే తంతు. ఏలూరు ఎంపీ స్థానాన్ని బీసీలకు కేటాయిస్తామని తెలుగుదేశం మొదటి నుంచి ప్రకటిస్తూనే వచ్చింది. ఆ దిశగానే అభ్యర్థి అన్వేషణలోనూ పడింది. వేరే సామాజిక వర్గాలకు చెందిన సీనియర్లు ఈ స్థానం వైపు చూసినా టీడీపీ అధి నేత చంద్రబాబు ససేమిరా కాదని బీసీ అభ్యర్థిగా పుట్ట మహేష్‌ కుమార్‌ యాద వ్‌ను రంగంలోకి దింపారు. ఆయన అభ్యర్థిత్వాన్ని షెడ్యూల్‌ విడుదలకు కొద్దిరోజుల ముందే ప్రక టించారు. అప్పటి నుంచి ఏలూరు లోక్‌సభ స్థానం కోసం బీజేపీ ప్రయత్నిస్తు న్నట్టుగా, ఆ పార్టీ పక్షాన తపన చౌదరి పోటీకి సిద్ధ మైనట్టు చిలువలు పలు వలుగా ప్రచారం సాగింది. లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ తీవ్ర చర్చే సాగింది. దీనిని ఖండిస్తూ తమ అభ్యర్థి పుట్ట మహేష్‌ అని టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటిం చింది. అయితే బీజేపీ ఎక్కడా వదలకుండా ఈ స్థానంపై తమ దృష్టే ఉందని, దానిని నుంచి తప్పించబోరని ప్రచారా నికి దిగింది. ఇది కూడా టీడీపీలో అసహనానికి దారి తీసింది.

నూజివీడు, కైకలూరులోను రచ్చ..

నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో సీటు మార్పిడి జరిగినప్పుడు టీడీపీ కేడర్‌ గందరగోళంలో పడగా సమాంతరంగా అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు వ్యవహారంలోనూ వైసీపీ నాయకత్వం మరో ఆలోచనే చేస్తున్నట్టు ప్రచారం దుమారంలా సాగింది. కైకలూ రులోనూ ఈ తరహా పరిస్థితే. ఆఖరికి కాంగ్రెస్‌లోనూ అభ్యర్థుల ప్రకటన వెలువడే వరకూ ఆ తర్వాత కూడా మార్పులు చేర్పులు ఉంటాయంటూ ఆ నోటా ఈ నోటా సాగిన ప్రచారం ఇంకో దుమారమైంది.

ఇప్పుడా వంతు దెందులూరు..

దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్‌ పేరును టీడీపీ తమ రెండో జాబితాలో ప్రకటించింది. మొదటి విడత జాబితాలో ప్రభాకర్‌ పేరు ఉంటుందని అందరూ ఊహించినా ఎందుకో అది సాధ్యం కాలేదు. రెండో విడతలో ప్రకటన వచ్చేంత వరకూ రకరకాల ప్రచారాలు అటు చింత మనేనిని, ఇటు తెలుగుదేశం కేడర్‌ను ఆశాంతికి గురి చేశాయి. గడిచిన మూడు రోజులుగా మళ్లీ కథ మొదలకొచ్చింది. చింత మనేని ప్రభాకర్‌కు టీడీపీ ముఖ్యులతో సాన్నిహిత్యం ఉంది. దీనికి తోడు మాస్‌లో ప్రత్యేక గుర్తింపు కలిగిన లీడరుగా పేరుంది. ఎన్నికల ముందు కూడా పార్టీ అధినేత చంద్రబాబు ఇదే విషయాన్ని బహిరంగ వేదికలపైన తేల్చి చెప్పేవారు. ఇక్కడ నెలకొన్న గందరగోళానికి తెర దించుతూ అందరి మాదిరిగానే ఈనెల 21వ తేదీన బీ–ఫారం అందుకోవ డానికి టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాల్సిందిగా శుక్రవారం మధ్యాహ్నం చింతమనేనికి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఆలోపే సీటు మారుస్తున్నారంటూ బీజేపీ వైపు నుంచి పెద్దఎత్తున ప్రచారం సాగగా ఎటు తేల్చుకోలేక జనం ఆనిశ్చితికి గురయ్యారు. ప్రత్యేకించి ఇదే దెందులూరు నియో జకవర్గం వైసీపీలోనూ ఇలాంటి తగాదాలే ఉన్నట్లు సోషల్‌ మీడియాలోనూ కొంతసేపు ప్రచారం సాగింది. ఇలా రకరకా ుగా నిర్ణయం ఒకవైపు, మార్పులు, చేర్పులు పేరిట సాగిన ప్రచారాలు ఈ ఎన్నికల సమయంలో సరికొత్త ట్రెండుగానే భావిస్తున్నారు. అయితే పార్టీ కేడర్‌, అభ్యర్థుల సానుభూతి పరులు తీవ్ర మానసిక ఆశాంతికి గురయ్యారు.

Updated Date - Apr 20 , 2024 | 12:45 AM