Share News

పాలిసెట్‌కు 3,418 మంది హాజరు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:33 AM

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం జరిగిన ఏపీ పాలీసెట్‌– 2024 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

పాలిసెట్‌కు 3,418 మంది హాజరు
ఏలూరు సెంట్‌ఆన్స్‌ కాలేజిలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 27 : పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం జరిగిన ఏపీ పాలీసెట్‌– 2024 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏలూరులోని 11 కేంద్రాల్లో నిర్వ హించిన ఈ పరీక్షకు 4,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసు కోగా, వీరిలో 3,418 మంది (84.3 శాతం) హాజరయ్యారని పరీక్షల జిల్లా కో–ఆర్డినేటర్‌ పి.సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ పరిశీలకుడు వై.ప్రసాదరావు, సెంటర్‌ కో–ఆర్డినేటర్‌

కందుల నాగేంద్ర వర ప్రసాద్‌ తెలిపారు. పరీక్షకు హాజరైన వారిలో బాలురు 2,119 మంది, బాలికలు 1,299 మంది ఉన్నారు. పాలిసెట్‌ నిర్వహణ తీరుని పరిశీలించేందుకు రాష్ట్ర సాంకే తికవిద్య శాఖ కమిషనర్‌ సీహెచ్‌.నాగరాణి పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పరీక్ష నిర్వహణపై సీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లా లో రెండు ప్రభుత్వ, ఆరు ప్రైవే టు పాలిటెక్నిక్‌ కళాశాలలుం డగా, వివిధ కోర్సుల్లో 3,280 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రవేశపరీక్ష ఫలితాలు తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 13న ప్రకటించాల్సి ఉంది. ఆ రోజున ఎన్నికల పోలింగ్‌ ఉన్నందున ఫలితాలు వాయిదాపడే అవకాశాలున్నాయి.

ముగిసిన డీఎల్‌ఎడ్‌ సెమిస్టర్‌ పరీక్షలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 27 : డీఎల్‌ఎడ్‌ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన మూడో సెమిస్టర్‌ పరీక్షకు జిల్లాలో 63 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 59 మంది, మొదటి సెమిస్టర్‌ పరీక్షకు 51 మందికి 48 మంది హాజరయ్యారని డీఈవో అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని, వీటితో ఈ పరీక్షలు ముగిశాయి.

Updated Date - Apr 28 , 2024 | 12:33 AM