Share News

నా పనితీరే.. గెలిపిస్తుంది

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:26 AM

ఈ ఐదేళ్లు పదవి లేకపోయినా నాకున్న పరిధిలో ఎన్నో సేవ లందించాను.

నా పనితీరే.. గెలిపిస్తుంది
ప్రజా సమస్యలను ఆలకిస్తూ.. వాటిని రాసుకుంటున్న ఆరిమిల్లి రాధాకృష్ణ

ఆంధ్రజ్యోతితో తణుకు టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ

నా ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి

2014–2019 మధ్య కాలంలో తణుకు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించా. గ్రామదర్శిని పేరిట గ్రామాల్లో పాదయాత్రగా వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించా. రూ.1,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టా. రూ.112 కోట్లతో 135 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీం కింద రూ.80.93 కోట్లతో 1,531 ఇళ్లు నిర్మించాం. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలా ల్లో 7,108 గృహాలకు 106.62 కోట్లు వెచ్చిచాం. దువ్వలో లో ఓల్టేజి సమస్య పరిష్కారానికి సబ్‌ స్టేషన్‌ నిర్మించి గృహ, వ్యవసాయ, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ అందించాం. తణుకు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా మార్చాం. రూ.8.5 కోట్లతో తల్లిపిల్లల ఆసుపత్రికి నూతన భవనం, అత్తిలిలో కోటి 80 లక్షలతో పీహెచ్‌సీ భవనం నిర్మించాం. ఇలా చెబుతూపోతే చాలానే వుంది. వీటిని ఇప్పటికి జనం గుర్తు పెట్టుకుంటున్నారు. ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు నా హయాంలో చేసిన పనిని వారే తిరిగి చెబుతున్నారు. వీరంతా నన్ను ఎంతగా అభిమాని స్తున్నారోనని.. ఈ నా పనితీరే నా గెలుపునకు దోహదం చేస్తుందని అప్పుడే అర్థమైంది.

చేసిన సేవలు.. సంతృప్తి

ఈ ఐదేళ్లు పదవి లేకపోయినా నాకున్న పరిధిలో ఎన్నో సేవ లందించాను. కరోనా సమయంలో ఆసుపత్రిలో బెడ్‌లు, ఆక్సి జన్‌ అందే పరిస్థితి లేదు. అప్పుడు అనేక మందికి నాకు తెలి సిన ఆసుపత్రుల యాజమాన్యంతో మాట్లాడి వారి అవసరా న్ని బట్టి ఆ సమస్యలను పరిష్కరించాను. యువతను ప్రోత్సహించేందుకు క్రికెట్‌ కిట్‌లు, పోటీలు నిర్వహించి బహుమతులు అందించా. ఇవి నాకు సంతృప్తినిచ్చేవి.

వైసీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి.. అక్రమాలు

ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అక్రమాలు, అరాచకాలు చోటు చేసుకున్నాయి. తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన అవినీతి, అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రైతుల పక్షాన నేను పోరాటం చేశాను. ఆ సమయంలో నాపై అక్రమంగా ఏడు కేసులు బనాయించారు. టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం ఆ బాండ్లను ఆన్‌లైన్‌లో లేకుండా చేసింది. పేదలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్ళు, జగనన్న లే అవుట్‌లలో సదుపాయాలు, రోడ్ల నిర్మాణాలు, ప్రభుత్వ అవినీతి, విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీల పెంపు, ఇంటి, చెత్త పన్నులు, నిత్యావసర, పెట్రో ధరలపై ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేపట్టాం. చంద్రబాబు అక్రమ అరెస్టుపై 53 రోజులపాటు దీక్షలు చేపట్టాం.

మధ్యలోనే నిలిచిన పనులు

వైసీపీ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా వెనుక బడింది. గతంలో జరిగిన అబివృద్ధి మినహా కొత్తగా చేసింది ఏమీ లేదు. గతంలో చేసిన పనులను ఇప్పటికి వినియో గంలోకి తేలేదు. చేపల మార్కెట్‌ భవనం కొద్దిపాటి పనులను పూర్తి చేసి ఇప్పటికి వాడుకలో తీసుకురాలేదు. ఇలా అన్ని చోట్ల ఉన్నాయి. వేల్పూరు సీహెచ్‌సీ భవనం, అత్తిలి జూనియర్‌ కాలేజి భవనాలకు నిధులు మంజూరై పనులు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారింది. అంతే వాటి పనుల పురోగతి నిలిచిపోయింది.

ఎన్నికల ప్రచారం.. కుటుంబ సహకారం

ఈ ఎన్నికల్లో తణుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నాతోపాటే కుటుంబ సభ్యులు అడుగులు వేస్తున్నారు. వారి సహకారం లేనిదే నేనేమీ చేయలేదు. నా విజయం కోసం అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అది నా అదృష్టం.

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే న్యాయం

రాష్ట్రానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అవసరం ఉంది. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం రావాలి. జనసేనాని పవన్‌, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే అందరినీ న్యాయం జరుగుతుంది.

– తణుకు

Updated Date - Apr 28 , 2024 | 12:27 AM