Share News

ఐదేళ్లూ అణచివేతే

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:22 AM

అడిగితే అణచివేతలు.. ప్రశ్నిస్తే కేసులు.. విధానాలపై విమర్శిస్తే బెదిరింపులు.. రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనా కాలంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నిరంకుశత్వం లో కొట్టుమిట్టాడుతున్నామా అంటూ సామాన్యుడి నుంచి మేధావుల వరకు అందరిలోనూ ఒకటే సందేహం.

ఐదేళ్లూ అణచివేతే

ప్రశ్నిస్తే వేధింపులు.. ఆపై పోలీసు కేసులు

ప్రజాస్వామ్యంలో పోలీసులను

ఎంత ఎక్కువ వాడుకుంటే అంత వేగంగా ఆ ప్రభుత్వం పతనమవుతుంది’ అని రాజనీతి శాస్త్రజ్ఞులు చెబుతారు.

ఇది పచ్చి నిజం. వైసీపీ ప్రభుత్వంలో అదే జరుగుతుంది అంటూ జిల్లాలోని ఓ పోలీసు అధికారి చెప్పిన వాస్తవాన్ని నేను రైతుగా చెబుతున్నా. కొన్నేళ్లుగా పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు, సంచులు తెచ్చుకునేందుకు చుక్కలు చూశాం.

గతంలో మిల్లులకు ఎప్పుడు వెళితే అప్పుడు సంచులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆర్బీకేలకు వెళ్లాలి. అక్కడ సంచులు ఉంటాయన్న గ్యారంటీ లేదు. పండించిన పంట అమ్ముకోవడానికి ఇన్ని తిప్పలా ? మా ఎమ్మెల్యేను నెగ్గించుకున్నాం. ఇప్పటి వరకు మేం ఉన్నామో... చచ్చామో అతనికి తెలియదు. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ గ్రామానికి వస్తున్నాడు. ఏం చెబుతాం. ఈ ప్రభుత్వంలో స్వతంత్రంగా బతికే పరిస్థితి లేకపోయింది.

ఇదీ గణపవరం మండలం

చిలకంపాడులోని ఓ రైతు ఆవేదన

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

అడిగితే అణచివేతలు.. ప్రశ్నిస్తే కేసులు.. విధానాలపై విమర్శిస్తే బెదిరింపులు.. రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనా కాలంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నిరంకుశత్వం లో కొట్టుమిట్టాడుతున్నామా అంటూ సామాన్యుడి నుంచి మేధావుల వరకు అందరిలోనూ ఒకటే సందేహం. ఎన్నికల వేళ ముద్దులు.. తల నిమురుతూ ఆలింగనాలు చేసుకుంటూ వుంటే అబ్బో... మంచివాడు మా అబ్బాయి అని అంతా అను కున్నారు. ఆ తర్వాతే తెలిసింది అసలు తత్వం.

సీపీఎస్‌ ఉద్యమంపై ఉక్కుపాదం

అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ తీసుకుని వస్తామంటూ ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ ఉద్యోగు లు డిమాండ్‌ చేస్తూనే వచ్చారు. ఏళ్లు గడుస్తున్నా దీనిపై జగన్‌ సర్కార్‌ స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగులు జిల్లావ్యా ప్తంగా నిరసనలు చేపట్టారు. వీటిని పోలీసులతో భగ్నం చేయ డానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఉద్యో గ సంఘ నాయకులపై కేసులు పెట్టారు. ఛలో విజయవాడ వెళ్లకుండా బస్‌ స్టేషన్‌లు, రైల్వేస్టేషన్‌లు, ప్రధాన సెంటర్‌ లలో పోలీసులు గస్తీ కాశారు. చివరకు సీపీఎస్‌ అమలు చే యలేదు. ఉద్యోగుల కనీస హక్కులను కాలరాశారు. సరెండర్‌ లీవులను అమలు చేయలేదు. పీఎఫ్‌ సొమ్ము లు ఇవ్వకుండా ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పటికీ ఆ కేసులు ఉన్నాయి.

మహిళలని చూడకుండా..

అంగన్‌వాడీ కార్యకర్తలదీ అదే దుస్థితి. కనీస వేతనం పెంచాలని, అదీ ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీని అమలుచేయాలని మాత్రమే అడిగారు. జీతం సకాలంలో ఇవ్వాలని, అంగన్‌వాడీ కేంద్రాల అద్దెలను చెల్లించాలని విన్న వించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో చివరకు మూకు మ్మడిగా ఉద్యమబాట పట్టారు. దీనిని జగన్‌ సహించలేక పోయారు. ఆందోళన విరమించకుంటే ఉద్యోగాలను తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది. విధుల్లోకి చేరని వారికి తొలగింపు నోటీసులను అందజేసింది. బలవంతంగా ఉద్యమాన్ని అణగ దొక్కింది. అంగన్‌వాడీలు విజయవాడ వెళ్లకుండా పోలీసులే రంగంలోకి దిగారు. జిల్లాలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో అంగన్‌ వాడీలను అరెస్ట్‌ చేసి చుక్కలు చూపించారు.

జూ నేతలపై కేసులకు లెక్కే లేదు

నర్సాపురంలో స్థానిక అవసరాల కోసం ఆందోళనలు, ఉద్య మాలు చేపట్టారంటూ ప్రతిపక్ష నాయకులపై అనేక కేసులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుపై 19, టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పొత్తూరి రామరాజు, జనసేన అభ్యర్థి బొమ్మి డి నాయకర్‌పై చెరో ఏడు నమోదయ్యాయి. తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జిపై ఏకంగా 15 కేసులు పెట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ తాడేపల్లిగూడెంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో పాదయా త్ర చేస్తే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. బాబ్జిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడానికి పోలీసు బలగాలు వెంటాడాయి. ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావర ణం ఏర్పడింది. పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులపై కేసులు నమోదుచేశారు. పండుగ రోజుల్లో జనసేన ఇన్‌ఛార్జ్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ నివాసంలో అర్ధరాత్రి పూట సెర్చ్‌ వారెంట్‌ లేకుండా నే తనిఖీలు చేసి భయభ్రాంతులకు గురిచేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై అనేక కేసులు పెట్టే శారు. ఇలా రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ప్రతి నియోజ కవర్గంలోనూ వైసీపీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించిం ది. ఎన్నడూ లేని విధంగా పోలీసులను ప్రయోగించి ప్రతిపక్షాలను అణచివేసేందుకు జగన్‌ సర్కార్‌ చేయని ప్రయత్నం లేదు. జిల్లాలో పోలీసులు శాంతి భద్రతలకంటే ప్రతిపక్ష నాయకులు, ఉద్యోగుల కదలికలపై నిఘా వేసేందుకే అత్యధిక సమయాన్ని వెచ్చించారు. సోషల్‌ మీడియా వేదికగా అధికార పార్టీ నాయకులను పరోక్షంగా విమర్శించినా, ప్రశ్నించినా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐదేళ్లలో ప్రభుత్వంపై మాట్లాడేందుకు భయపడే పరిస్థితి కల్పించింది.

రైతులనూ వదల్లేదు

ధాన్యం సకాలంలో కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కితే కేసులు నమోదు చేసిన ఘనత ప్రభుత్వం మూట గట్టుకుంది. రైతుల ధర్నాలో అండగా నిలిచిన రాజకీయ నాయకులపై కేసులు పెట్టారు. పెంటపాడు మండలంలోనే ఇది చోటు చేసుకుంది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపా రంటూ అలంపురం సర్పంచ్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జి తదితరులపై కేసులు పెట్టారు. రైతుల నోరు మూయించే ప్రయత్నం చేశారు.

Updated Date - Apr 20 , 2024 | 12:22 AM