Share News

Gold and Silver Rates: రెండు వేలు తగ్గిన వెండి, బంగారం ఎంతంటే

ABN , Publish Date - Apr 28 , 2024 | 07:16 AM

గత మూడు నాలుగు వారాలుగా నిరంతరంగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు ఈ వారం స్వల్పంగా తగ్గాయి. ఈరోజు మాత్రం పుత్తడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ.74,660గా ఉంది.

Gold and Silver Rates: రెండు వేలు తగ్గిన వెండి, బంగారం ఎంతంటే
gold rate today april 28th 2024 hyderabad and india

గత మూడు నాలుగు వారాలుగా నిరంతరంగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు ఈ వారం స్వల్పంగా తగ్గాయి. ఈరోజు(ఏప్రిల్ 28న) మాత్రం పుత్తడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ.74,660గా ఉంది. ఇది నిన్నటితో పోల్చితే మార్పు లేదు. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ.67,700గా ఉంది. దేశంలో గత 10 రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ కొనసాగాయి. ఈ క్రమంలో గత 10 రోజుల్లో గ్రాము బంగారం ధర రూ.130 తగ్గింది.


వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు)

హైదరాబాద్‌లో రూ.67,700

చెన్నైలో : రూ.67,550

బెంగళూరు: రూ.66,650

ముంబై: రూ.66,650

ఢిల్లీ: రూ.66,800

కోల్‌కతా: రూ.66,650

కేరళ: రూ. 66,650

అహ్మదాబాద్: రూ.66,700

జైపూర్: రూ. 66,800

లక్నో: రూ. 66,800

భువనేశ్వర్: రూ.66,650


ఇక వెండి ధరల(silver rates) విషయానికి వస్తే ఈరోజు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.87,500 ఉండగా, ఏప్రిల్ 19న రూ.86,500గా ఉంది. గత 10 రోజుల్లో వెయ్యి రూపాయలు తగ్గింది. మరోవైపు ఢిల్లీలో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.84 వేలుగా ఉంది, ఇది ఏప్రిల్ 19న రూ.86,500గా ఉంది. గత 10 రోజుల్లో ఢిల్లీలో రూ.2500 తగ్గడం విశేషం.


ఇది కూడా చదవండి:

IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా


Read Latest Business News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 07:20 AM