Share News

Turmeric Vs Kidney Health: పసుపు మూత్రపిండాలకు హాని చేస్తుందా? అసలు పసుపు ఎవరు ఎక్కువ వాడకూడదంటే..!

ABN , Publish Date - May 08 , 2024 | 10:28 AM

పసుపు వంటింట్లో సహాజంగా వాడే పదార్థం. ఆయుర్వేదం పసుపును ఔషదంగా వర్ణిస్తుంది. పసుపును కేవలం వంటల్లోనే కాకుండా వైద్యంలోనూ, సౌందర్య సాధనంగానూ ఉపయోగిస్తారు. ఏ రకంగా చూసినా పసుపుతో లాభాలే అనిపిస్తాయి. కానీ పసుపుతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.

Turmeric Vs Kidney Health: పసుపు మూత్రపిండాలకు హాని చేస్తుందా? అసలు పసుపు ఎవరు ఎక్కువ వాడకూడదంటే..!

పసుపు వంటింట్లో సహాజంగా వాడే పదార్థం. ఆయుర్వేదం పసుపును ఔషదంగా వర్ణిస్తుంది. పసుపును కేవలం వంటల్లోనే కాకుండా వైద్యంలోనూ, సౌందర్య సాధనంగానూ ఉపయోగిస్తారు. ఏ రకంగా చూసినా పసుపుతో లాభాలే అనిపిస్తాయి. కానీ పసుపుతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మూత్రపిండ సమస్యలు ఉన్నవారు పసుపు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అని అది మూత్రపిండాలకు హానికరం చేస్తుందని అంటారు. పసుపుతో కలిగే దుష్ర్పబావాలేంటో తెలుసుకుంటే..

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. కిడ్నీ సంబంధిత వ్యాధుల నివారణలో పసుపు మంచిదని తెలిసినా.. ఇది కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నవారు పసుపును ఎక్కువ వాడకూడదు.

వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!


పసుపులో కర్కుమిన్ ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం అధిక మొత్తం కర్కుమిన్ నెఫ్రోటాక్సిక్ ప్రభావాలు కలిగి ఉంటుంది. ఇది ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కిడ్నీలు దెబ్బతినడానికి కారణమవుతుంది.

కొందరికి శరీరంలో రక్తం చాలా చిక్కగా ఉంటుంది. ఇందుకు గానూ రక్తం పలచబడటానికి మందులు వాడుతున్నవారు కూడా పసుపు ఎక్కువ తీసుకోకూడదు. పసుపు ఈ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించకుండా పసుపుకు సంబంధించిన ఏ విధమైన సప్లిమెంట్లు తీసుకోకూడదు.

పసుపులో ఉండే ఆక్సలేట్ మూత్రపిండాలలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లను ఏర్పరుస్తుంది. ఇప్పటికే కిడ్నీలలో రాళ్ల సమస్య ఉన్నవారు పసుపును మితంగా తీసుకోవాలి.

ప్రపంచంలోనే అరుదైన 7 జంతువులు ఇవీ..!

వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 08 , 2024 | 10:28 AM