Share News

Chia seeds : చియా సీడ్స్‌ని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చంటే.. !

ABN , Publish Date - Mar 28 , 2024 | 02:35 PM

ఇవి రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించేందుకు గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు సహకరిస్తాయి

Chia seeds : చియా సీడ్స్‌ని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చంటే.. !
Chia seeds

చియా గింజలు (Chia seeds) పరిమాణంలో చిన్నగా ఉంటాయి కానీ వాటితో కలిగే ప్రయోజనాలు మాత్రం ఆరోగ్యపరంగా చాలా గొప్పవనే చెప్పాలి. ఇందులోనవి ప్రోటీన్, డైటరీ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో సహా పోషకాలలో చాలా సమృద్ధిగా ఉంటాయి. చియా విత్తనాలు శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నవే.. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్, ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించేందుకు గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు సహకరిస్తాయి. ఇవి బహుముఖమైనవి. సమతుల్య ఆహారంగా వీటిని తీసుకుోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. వీటిని రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటంటే..!

చియా సీడ్ పుడ్డింగ్..

చియా విత్తనాలను రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. తర్వాత ఇవి కాస్త జిగురుగా ఉబ్బి తయారవుతాయి. వీటిని సలాడ్స్, డెజర్ట్స్ తో కలిపి ఎలా అయినా తీసుకోవచ్చు. స్వీటెనర్ తో చియా గింజలను కలిపి రుచి కోసం రాత్రిపూట ఫ్రిజ్ లో ఉంచాలి.

టాపింగ్స్..

పెరుగు నుంచి యాపిల్ సాస్ వరకూ అన్ని రకాలుగా దీనిని తీసుకోవచ్చు. అలాగే స్మూతీస్ లో కూడా మంచి కాంబినేషన్ అవుతుంది.

స్మూతీ బూస్టర్..

ఫైబర్, ప్రోటీన్ కోసం ఇష్టమైన స్మూతీకి ఒక టేబుల్ స్పూన్ చియా గింజలు సరిపోతాయి.

చియా జామ్..

చియా గింజలను మెత్తని పండ్లతో కలిపి మంచి రుచికరమైన జామ్ కూడా చేయవచ్చు. చిక్కబడే వరకూ ఫ్రిజ్‌లో ఉంచాలి.

చియా నీరు..

రిఫ్రెష్, హైడ్రేటింగ్ పానీయం కోసం చియా గింజలను నీటితో కలిపి, నిమ్మకాయ రసంతో తీసుకుంటే మంచి రుచిగా ఉంటుంది.

చియా వోట్మీల్..

అదనపు పోషకాహారంగా చియా విత్తనాలను ఉదయం పూట వోట్మిల్లో కలిపి తీసుకుంటే సరి.

ఇవి కూడా చదవండి: అధిక బరువు తగ్గించే శాకాహారం.. రోజూ తీసుకుంటే .!

ఈ పండు రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుందట...!

వేసవిలో వికసించే ఈ పూలమొక్క.. మొత్తం తోటకే అందాన్ని తెస్తుంది.. వీటిలో..

ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..!


సలాడ్స్..

కమ్మని సలాడ్స్ మీద చియా గింజలు చల్లి తీసుకున్నా రుచి పరంగానే కాదు.. పోషకాల పరంగా కూడా మంచి కాంబినేషన్ అవుతుంది.

బేకింగ్..

మఫిన్, బ్రెడ్ వంటి వాటిలో చియా గింజలను వాడటం వల్ల కొత్త రుచిని తీసుకురావచ్చు.

గుడ్డు..

చియా గింజలను గుడ్డుకు ప్రత్యామ్నాయంగా వాడి చూడండి. వీటి జిరుగు, జిగటతో వంటలకు కొత్త రుచి వచ్చి చేరుతుంది.

వీటిని ఆహారంలో చేర్చుకోవడం సులభం. అలాగే ఆరోగ్యానికి కూడా మంచి సపోర్ట్ ఇస్తాయి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Mar 28 , 2024 | 02:45 PM