Share News

Coconut Water : కొబ్బరి నీరు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏవంటే..!

ABN , Publish Date - May 08 , 2024 | 04:33 PM

కొబ్బరి నీటిని మధ్యాహ్నం భోజనానికి ముందు తాగుతారు. ఇది అతిగా తినడం నుంచి రక్షిస్తుంది. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగవుతుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా తగ్గుతుంది.

Coconut Water : కొబ్బరి నీరు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏవంటే..!
immune system

వేసవి కాలంలో డీహైడ్రేషన్ ను నివారించాలనుకుంటే శరీరంలో నీటి కొరత ఉండదు. వేసవి ప్రారంభం కాగానే ఈ కొబ్బరి నీటికి ఎంత గిరాకీనో.. హైడ్రేటెజ్ గా ఉంచుకోవడానికి కొబ్బరినీరు తాగడం మంచిది. దీనివల్ల హీట్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. శరీరానికి శక్తిని, ఖనిజాలను అందిస్తుంది. కొబ్బరి నీరు తక్కువ కేలరీల పానీయం ఇందులోని ఎంజైములు, పొటాషియంను అందిస్తాయి. అయితే రోజులో ఏ సమయంలో తాగితే మంచిది.

కొబ్బరి నీళ్లు తాగడానికి సరైన సమయం ఎప్పుడు..

ఎప్పుడైనా కొబ్బరి నీటిని తాగచ్చు. కొందరు నిద్ర లేవగానే కొబ్బరి నీరు తాగుతారు. వ్యాయామం తర్వాత కొబ్బరి నీరు తాగితే మంచిది. ఇలా చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు.

ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల..

ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల చాలా లాభాలున్నాయి. ఈ నీరు హీట్ స్ట్రోక్ రిస్క్ తగ్గిస్తుంది. శరీరానికి శక్తిని, ఖనిజాలను అందిస్తుంది. కొబ్బరి నీరు తక్కువ కేలరీలు గల పానీయం. శరీరానికి ఇది ఎంజైములను, పొటాషియం అందిస్తుంది. డీహైడ్రేషన్ సమస్యను దూరం చేస్తుంది. వేసవిలో ఉదయం సమయాల్లో తీసుకుంటే గుండెలో మంట , ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.


High cholesterol : ఈ లక్షణాలు గమనిస్తే ఇట్టే చెప్పచ్చు.. పురుషుల్లో అధిక కొలెస్ట్రాల్ ఉందని.. అవేమిటంటే..!

వ్యాయామానికి కొబ్బరినీరు..

కొబ్బరిలోని సహజ శక్తి వర్కవుట్ చేసిన తర్వాత ఎనర్జీ మెయింటెయిన్ అవుతుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ శరీరంలో పునరుద్దరించబడతాయి. అలసట నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

ఆహారం తీసుకునే ముందు..

కొబ్బరి నీటిని మధ్యాహ్నం భోజనానికి ముందు తాగుతారు. ఇది అతిగా తినడం నుంచి రక్షిస్తుంది. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగవుతుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా తగ్గుతుంది.


Health : ఆస్తమాతో బాధపడుతున్నారా? ఈ దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితి గురించి ఉన్న అపోహలేమిటి..!

రాత్రి పుడుకునే ముందు..

పడుకునే ముందు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఒత్తిడి తగ్గిస్తుంది. నిద్ర బాగా పడుతుంది. శరీరంలో పేరుుకపోయిన అన్ని హానికరమైన పదార్ధాలను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. యూటీఐ, కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 08 , 2024 | 04:33 PM