Share News

Fennel Seeds : సోంపు గింజలను రోజూ తీసుకుంటే జరిగే మేలు ఇదేనట..!

ABN , Publish Date - May 07 , 2024 | 04:45 PM

సోంపు గింజలు థైమోల్ ను కలిగి ఉన్నాయి. ఇది జీర్ణ కండరాలను సడలించడం, తిమ్మిరి, అసౌకర్యాన్ని తగ్గించే యాంటిస్పాస్మోడిక్ లక్షణాలతో ఉంటుంది. జీలకర్ర గింజలు, జీర్ణ ఎంజైమ్ లను ఉత్పత్తి చేస్తాయి. సోంపు గింజల్లోని ఫైబర్ జీర్ణ పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Fennel Seeds : సోంపు గింజలను రోజూ తీసుకుంటే జరిగే మేలు ఇదేనట..!
Fennel Seeds

కమ్మని భోజనం తర్వాత నోటిని కమ్మగా, ఫ్రెష్‌గా ఉంచే సోంపు నమిలి తినడం జీర్ణక్రియకు కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు భోజనం తర్వాత పంటి శుభ్రతను కూడా దృష్టిలో పెట్టుకుని కూడా చాలా మంది సోంపును తింటూ ఉంటారు. అంతే కాకుండా మసాలా దినుసుగా కూడా సోంపును ఉపయోగిస్తూంటారు. ఇది వంటకు కమ్మని రుచిని, ప్రత్యేకమైన సువాసనను కూడా ఇస్తాయి.

సోంపు గింజలు థైమోల్ ను కలిగి ఉన్నాయి. ఇది జీర్ణ కండరాలను సడలించడం, తిమ్మిరి, అసౌకర్యాన్ని తగ్గించే యాంటిస్పాస్మోడిక్ లక్షణాలతో ఉంటుంది. జీలకర్ర గింజలు, జీర్ణ ఎంజైమ్ లను ఉత్పత్తి చేస్తాయి. సోంపు గింజల్లోని ఫైబర్ జీర్ణ పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Protein Food : రోజువారి ఆహారంలో ప్రోటీన్ ఫుడ్స్ ఎలా చేర్చుకోవాలి.. !

ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..

సోంపు ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహకరిస్తుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. సోంపు గింజలతో పాటు జీలకర్రను కలిపి తింటే తీసుకుంటే బరువు తగ్గుతారు. ఈ నీటిని ఉదయాన్నే తాగితే మంచి ఫలితం ఉంటుంది. వర్కవుట్లు చేయడానికి ఆహారం పై శ్రద్ధ పెడుతూనే ఉదయాన్నే ఈ డ్రింక్ తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.


సోంపు చాలా బాగా పని చేస్తుంది. సోంపు గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే మౌత్ ఫ్రెషనర్‌గానే కాదు, పోషక విలువలు ఉన్న ఆహారంగా ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

నీటిలో నానబెట్టిన సోంపుతో..

సోంపు గింజలను నీటిలో నానబెట్టి, మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కడుపు మంట సమస్యలు తగ్గుతాయి. నీటిని ఉదయం తీసుకోవాలి. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కొవ్వును కరిగిస్తాయి.


సోంపులో ఎస్ట్రాగోల్, ఫెంచోన్, అనేథోల్ ఉండటం కారణంగా జీర్ణక్రియలో సహాయపడే గ్యాస్ట్రిక్ ఎంజైమ్ స్రావానికి సహకరిస్తుంది.

సోంపుతో టీని కూడా చేసుకుని తీసుకోవచ్చు. ఇది నోటి శుభ్రతకు, మంచిది. బరువు తగ్గేందుకు కూడా సపోర్ట్ చేస్తుంది. సోంపు స్వీట్స్, కిళ్ళీ, నానబెట్టిన సోంపు గింజలు, సోంపు టీ ఇలా చాలా రకాలుగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిదే.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 07 , 2024 | 04:47 PM