Share News

Diabetes: ఉద్యోగస్తులు ఈ చిట్కాలు పాటిస్తే..! తక్కువ టైంలోనే మధుమేహానికి చెక్..!

ABN , Publish Date - Mar 23 , 2024 | 03:51 PM

ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుని ఆఫీస్ పని వేళల్లో తీసుకుంటూ ఉండాలి. సమతుల్య ఆహారాన్ని ప్రోత్సహించాలి. మధుమేహాన్ని తీవ్రతరం చేసే ఆహారాలను తినడం తగ్గించాలి.

Diabetes: ఉద్యోగస్తులు ఈ చిట్కాలు పాటిస్తే..! తక్కువ టైంలోనే మధుమేహానికి చెక్..!
Diabetes

ఈ రోజుల్లో మధుమేహం సర్వసాధారణమైన సమస్యగా మారింది. ప్రతి పదిమందిలో ఆరుగురు మధమేహంతో బాధపడుతున్నవారే అవుతున్నారు. ముఖ్యంగా డయాబెటిక్‌తో బాధపడుతున్నవారు సరైన ఆహారం తీసుకోవాలి. లేదంటే సమస్య మరింత పెద్దది అయ్యే అవకాశం ఉంది. అయితే మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటి.

ఈ సమస్య నుంచి బయట పడాలంటే

స్థిరమైన అధిక రక్తంలో చక్కెర స్థాయిలతో ఉద్యోగాలు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోక తప్పదు., ఒత్తిడితో కూడిన వాతావరణం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల మధుమేహం విపరీతంగా పెరుగుతుంది. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే చిన్న చిన్న మార్పులు అనుసరించాలి.

ఇది కూడా చదవండి: వేసవిలో మట్టి కుండలో నీటిని ఎందుకు తాగాలి..! దీనితో కలిగే ప్రయోజనాలేంటి..!

మధుమేహం అవగాహన

వర్క్‌ప్లేస్ డయాబెటిస్ అవగాహన కార్యక్రమాలు ఉద్యోగులకు పఅవగాహన కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ద్వారా ప్రమాద కారకాలు, లక్షణాలు, సంకేతాలు తెలుస్తాయి. అలాగే షుగర్ వ్యాధి ఉన్న వ్యక్తులలో క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం అవగాహన పెరుగుతుంది. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకుంటారు. అలాగే తగిన విధంగా ఆహార నియమాలను కూడా పాటించే వీలు ఉంటుంది.

రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్

మధుమేహం లేదా దాని సంక్లిష్టతలను హెల్త్ స్త్రీనింగ్ ద్వారా నిరోధించవచ్చు. వర్క్‌ప్లేస్ క్లినిక్‌లలో, డయాగ్నొస్టిక్ సెంటర్‌లలో వార్షిక ఆరోగ్య పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవచ్చు.

తేలికపాటి (డెస్క్) వ్యాయామాలు..

ఈ పరిస్థితిని నిర్వహించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి ఉద్యోగులలో తగినంత శారీరక శ్రమ అవసరం. వాకింగ్ మీటింగ్‌లను ప్రోత్సహించడం, మెట్లు ఎక్కడం, కార్యాలయాల్లో జిమ్ సౌకర్యాలు కల్పించడం లేదా జిమ్ మెంబర్‌షిప్‌లు వంటివి ఉద్యోగులను మరింత కదిలేలా చేయడానికి కొన్ని మార్గాలు. ఇది ఆరోగ్యాన్ని పెంచే విధంగా సహకరిస్తుంది.

ఆరోగ్యంగా తినండి

ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుని ఆఫీస్ పని వేళల్లో తీసుకుంటూ ఉండాలి. సమతుల్య ఆహారాన్ని ప్రోత్సహించాలి. మధుమేహాన్ని తీవ్రతరం చేసే ఆహారాల వినియోగాన్ని తగ్గించాలి.


ఇవి కూడా చదవండి: నలుపు ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల కలిగే పది ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!

బాక్స్ శ్వాస అంటే ఏమిటి? దీని ప్రధాన ప్రయోజనాలు ఏంటి..!

వేసవిలో మట్టి కుండలో నీటిని ఎందుకు తాగాలి..! దీనితో కలిగే ప్రయోజనాలేంటి..!

బరువు తగ్గడాన్ని ప్రోత్సహించే వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది..!

ఒత్తిడిని దూరంగా ఉంచండి.

ఒత్తిడికి గురైన ఉద్యోగులు అతిగా తినడం, ఆల్కహాల్, మాదకద్రవ్యాలకు అలవాటు పడతారు. ఒత్తడి అనేది మధుమేహ స్థాయిలను ఇంకా పెంచుతుంది. దీనికి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, కౌన్సెలింగ్ సేవలు, యోగా, మైండ్‌ఫుల్‌నెస్ సెషన్‌లు ఉద్యోగులకు సహాయపడతాయి.

జీవనశైలి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ, పొగాకు, అధిక మద్యపానానికి దూరంగా ఉండటం ప్రతి ఉద్యోగి, కార్యాలయంలో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో దోహదపడుతుంది. అదేవిధంగా, డయాబెటిస్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌లను రూపొందించడం కూడా మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Mar 23 , 2024 | 03:52 PM