Share News

Health Benefits Of Lemon: ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. !

ABN , Publish Date - Mar 20 , 2024 | 03:31 PM

కాస్త వేడి ఎక్కువైన మధ్యాహ్నాలు శరీరాన్ని చల్లబరిచేందుకు కూడా నిమ్మకాయ నీటిని పంచదార కలిపి తీసుకుంటూ ఉంటారు. మరింత చల్ల బడేందుకు పలుచని మచ్చిగతో కలిపి పుదీనా ఆకులు వేసుకుని తీసుకుంటారు. ఈ పానీయంలో ఉన్న పోషకాల విషయానికి వస్తే...

Health Benefits Of Lemon: ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. !
lemon juice

చాలా మందికి ఉదయం పూట ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. నిమ్మరసం నీళ్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఈ నీళ్లలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలంటే..

నిమ్మకాయ నీటిని చాలా రకాలుగా తీసుకుంటారు. ఈ నీటిలో కాస్త తేనెను కలిపి ఉదయాన్నే తీసుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అలాగే కాస్త వేడి ఎక్కువైన మధ్యాహ్నాలు శరీరాన్ని చల్లబరిచేందుకు కూడా నిమ్మకాయ నీటిని పంచదార కలిపి తీసుకుంటూ ఉంటారు. మరింత చల్ల బడేందుకు పలుచని మచ్చిగతో కలిపి పుదీనా ఆకులు వేసుకుని తీసుకుంటారు. ఈ పానీయంలో ఉన్న పోషకాల విషయానికి వస్తే...

నిమ్మకాయ నీరులో అనేక పోషకాలున్నాయి. అయితే దీనిని మరీ తీసుకుంటే మాత్రం ముఖ్యంగా సిట్రిక్ యాసిడ్ ఇది పంటి ఎనామిల్ ను పాడుచేస్తుంది. కనుక నిమ్మకాయ నీటిని తాగిన వెంటనే నోటిని నీటితో క్లీన్ చేసుకోవాలి.

శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో నిమ్మకాయ నీరు సహకరిస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఇది రోగనిరోధక శక్తిని పెంచి యాంటీఆక్సిడెంట్ శరీరాన్ని అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది.

జీర్ణక్రియకు కూడా నిమ్మకాయ మంచిదే.. అజీర్ణాన్ని తగ్గించి, జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది.

Ph స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. నిమ్మకాయలో ఆమ్ల స్వభావం ఉంటుంది. ఇది శరీరంపా ఆల్కలైజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని PH స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

బరువు నిర్వహణలోనూ నిమ్మకాయ సహకరిస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది.

చర్మాన్ని క్లీన్ చేస్తుంది.

లెమన్ వాటర్‌లోని యాంటీఆక్సిడెంట్లు స్పష్టమైన కాంతివంతమైన ఛాయను ఇస్తుంది.


ఇది కూడా చదవండి: చియా విత్తనాలు బరువు తగ్గడానికి సహాయపడగలవా? పోషకనిపుణులు ఏమంటున్నారు..!

శ్వాస తాజాగా..

నిమ్మనీటిలో నోటి దుర్వాసనను సహజ నివారణగా పని చేస్తుంది.

కాలేయాన్ని శుభ్రపరిచేందుకు కూడా నిమ్మకాయ నీటిని డిటాక్స్ డైట్‌లలో ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి: అధిక బరువు తగ్గించే శాకాహారం.. రోజూ తీసుకుంటే .!

ఈ పండు రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుందట...!

వేసవిలో వికసించే ఈ పూలమొక్క.. మొత్తం తోటకే అందాన్ని తెస్తుంది.. వీటిలో..

ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

గుండెల్లో మంట.. తరచుగా గుండెల్లో మంటను తగ్గిస్తుంది. ఇది PHస్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

వాపును తగ్గిస్తుంది.

నిమ్మరసంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Mar 20 , 2024 | 03:31 PM