Share News

Gulf ikya vedika: కరోనా కష్ట కాలంలో ఆదుకున్న అర్వింద్

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:21 PM

గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ భారతీయుల కోసం నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపూరి అర్వింద్ అండ దండ.. గా నిలిచారని గల్ఫ్ ఐక్య వేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ బరిలో దిగుతున్న అర్వింద్‌ను మరోసారి గెలిపించి.. పార్లమెంట్‌కు పంపాలని ప్రవాసీయులకు, వారి కుటుంబాలకు గల్ఫ్ ఐక్య వేదిక విజ్జప్తి చేసింది.

Gulf ikya vedika: కరోనా కష్ట కాలంలో ఆదుకున్న అర్వింద్
Gulf Ikya Vedhika

గల్ప్, ఏప్రిల్ 24: గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ భారతీయుల కోసం నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపూరి అర్వింద్ అండ దండ.. గా నిలిచారని గల్ఫ్ ఐక్య వేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ బరిలో దిగుతున్న అర్వింద్‌ను మరోసారి గెలిపించి.. పార్లమెంట్‌కు పంపాలని ప్రవాసీయులకు, వారి కుటుంబాలకు గల్ఫ్ ఐక్య వేదిక విజ్జప్తి చేసింది.

AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ

గురువారం జగిత్యాలలో గల్ఫ్ ఐక్య వేదిక కన్వీనర్ వంశీ గౌడ్ అధ్వర్యంలో ప్రతినిధులు గాజుల సంపత్ కుమార్, మధు చిట్ల, ఆశోక్ కొట్టాల, వసంత్ రెడ్డి, ఆర్మూర్ శ్రీకాంత్, బోరగళ్ళ రమేశ్ తదితరులు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు ప్రవాసీయులు మద్దతు ఇవ్వాలని కోరారు.


కరోనా కష్ట కాలంలో ఎంపీగా ధర్మపూరి అర్వింద్.. ప్రవాసీయులకు అందించిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే కరోనా రోగుల కోసం స్వంత నిధులతో క్వారంటైన్ వసతిని ఏర్పాటు చేసి.. ప్రవాసీయులను ఆదుకోన్న విషయం మరువరాదన్నారు.

PM Modi: ‘బతికుండగానే కాదు.. చనిపోయిన తర్వాత దోచుకుంటుంది’

అలాగే ప్రవాసీయులకు స్వంత నగదుతో విమాన టిక్కేట్లు కొనుగోలు చేసి ఇచ్చారని వారు తెలిపారు. ఎడారి దేశంలోని ప్రవాసీ భారతీయుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరించారు. మరోవైపు నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టి. జీవన్ రెడ్డి బరిలో నిలిచారని చెప్పారు.

Sam Pitroda Comments: బీజేపీ ఆరోపణలు.. స్పందించిన ఖర్గే

అయితే ఆయన ప్రవాసీయుల గూర్చి ఏ రోజు పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయిందని.. అయితే నేటి వరకు గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టలేదని వారు వివరించారు.

Read National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 05:21 PM