Medaram Jatara : జనసంద్రంగా మేడారం.. దారులన్నీ అమ్మల వైపే..

ABN, Publish Date - Feb 21 , 2024 | 03:59 PM

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం నుంచి నాలుగురోజుల పాటు ఘనంగా జరగనుంది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మను తీసుకువచ్చారు వడ్డెలు. ఆదివాసి సంప్రదాయంలో పూజలు చేసి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తీసుకువచ్చారు.

Medaram Jatara : జనసంద్రంగా మేడారం.. దారులన్నీ అమ్మల వైపే.. 1/5

వన దేవతల్లో ఒకరైన సారలమ్మ బుధవారం మేడారం గద్దె మీదకు రానుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దె మీదకొస్తారు. సారలమ్మ మేడారానికి వేంచేయడంతోనే నాలుగురోజుల మహాజాతరకు తెరలేవనుంది.

Medaram Jatara : జనసంద్రంగా మేడారం.. దారులన్నీ అమ్మల వైపే.. 2/5

ఈ మేరకు బుధవారం తెల్లవారుజాము నుంచే సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలవుతాయి. పొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి.. ఆలికి ముగ్గులతో అలంకరిస్తారు. ప్రధాన పూజారి అయిన కాక సారయ్య పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు.

Medaram Jatara : జనసంద్రంగా మేడారం.. దారులన్నీ అమ్మల వైపే.. 3/5

ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారలమ్మ (సారయ్య రూపంలో)ను ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు తీసుకొస్తారు. సమ్మక్క గారాల బిడ్డ అయిన సారలమ్మ ధైర్యానికి, వీరత్వానికి, త్యాగానికి ప్రతీక.

Medaram Jatara : జనసంద్రంగా మేడారం.. దారులన్నీ అమ్మల వైపే.. 4/5

సారలమ్మ వీధిలోకి రాగానే పూజారులు పీటలు వేసి కాళ్లు కడిగి.. మంగళహారతులు ఇచ్చి తల్లిని సాగనంపుతారు. సారలమ్మ కన్నెపల్లి మీదుగా తన తమ్ముడు జంపన్నను పలకరిస్తూ జంపన్నవాగును దాటి సాయంత్రానికి గద్దెకు చేరుకుంటుంది.

Medaram Jatara : జనసంద్రంగా మేడారం.. దారులన్నీ అమ్మల వైపే.. 5/5

గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు చేర్చుతారు. ఆ రోజు మహాజాతర మరోస్థాయికి చేరుతుంది. 24న సాయం త్రం వనదేవతలు తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతారు.

Updated at - Feb 21 , 2024 | 04:06 PM