Share News

Viral Video: కింగ్ కోబ్రాతో కబడ్డీ ఆడుకున్న కోతి.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 27 , 2024 | 09:44 PM

పాముల్లో కింగ్ కోబ్రా ఎంత భయంకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అవి కాటు వేశాయంటే ఇక ప్రాణాలతో బయటపడడం దాదాపు అసాధ్యం. అందుకే ఎంతో అనుభవం ఉన్న వారు కూడా ఈ పాములతో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక జంతువులు కూడా ఈ పాములను చూడగానే...

 Viral Video: కింగ్ కోబ్రాతో కబడ్డీ ఆడుకున్న కోతి.. చివరకు ఏం జరిగిందంటే..

పాముల్లో కింగ్ కోబ్రా ఎంత భయంకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అవి కాటు వేశాయంటే ఇక ప్రాణాలతో బయటపడడం దాదాపు అసాధ్యం. అందుకే ఎంతో అనుభవం ఉన్న వారు కూడా ఈ పాములతో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక జంతువులు కూడా ఈ పాములను చూడగానే ఆమడదూరం పారిపోతుంటాయి. అయితే కొన్నిసార్లు ఈ కోబ్రాలకూ పరాభవం తప్పదు. ఇందుకు సంబంధించిన అనేక ఘటనలు నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కింగ్ కోబ్రాతో ఓ కోతి కబడ్డీ ఆడుకుంది. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గడ్డిలో ఓ కోతిని ఇనుప గొలుసుతో కట్టేసి ఉంచుతారు. అంతలో ఓ కింగ్ కోబ్రా (King cobra snake) అక్కడికి వస్తుంది. కోతిని చూడానే కాటు వేయాలని పడగ విప్పి బుసలు కొడుతుంది. అయితే కోతి ఏమాత్రం భయపడకుండా దానికి ఎదురు నిలుస్తుంది. అంతటితో ఆగకుండా కబడ్డీ ఆటలో బార్డర్ లైన్ టచ్ చేసిన విధంగా పాము దగ్గరికి వెళ్లి, కాలితో నేలను తాకి మళ్లీ వెనక్కు వెళ్తుంది. ఇలా పదే పదే చేస్తూ కింగ్ కోబ్రాకు సవాల్ విసురుతుంది. ఈ క్రమంలో కోబ్రా చాలా సార్లు కోతిని (king cobra tried to bite monkey) కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది.

Viral Video: రాత్రి వేళ ఇలాంటి డ్రస్సులు వేసుకుని రోడ్డుపైకి వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో చూడండి..


అక్కడి నుంచి దూరం పారిపోవడానికి వీలు లేకున్నా.. కోతి మాత్రం కోబ్రా కాటు నుంచి తెలివిగా తప్పించుకుంటూనే ఎదురుదాడి చేస్తుంది. కాటు వేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ దాని తనపై తన గోర్లతో రక్కుతుంది. ఇలా పదే పదే రక్కడంతో కోబ్రాకు చుక్కలు కనిపిస్తాయి. చివరకు కోతితో పోరాటం చేయలేక తోక ముడిచి అక్కడి నుంచి పరారవుతుంది. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘కోతిని కట్టేసి వేడుక చూడడం దారుణం’’.. అంటూ కొందరు, ‘‘పొరపాటున కోతిని కాటేస్తే పరిస్థితి ఏంటీ’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలా జంతువులను హింసించే వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వావ్..! ఏం ఐడియా బ్రదర్.. వేసవిలో వద్దన్నా కూడా అంతా ఈ ఆటోనే ఎక్కేస్తారు.. ఎందుకంటే..

Updated Date - Apr 27 , 2024 | 09:49 PM