Share News

Viral Video: ఏసీ మిషన్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. శుభ్రం చేసేందుకు తెరిచిచూడగా..

ABN , Publish Date - Apr 21 , 2024 | 05:02 PM

ఇళ్లల్లో కొన్నిసార్లు షాకింగ్ సీన్‌లు చూస్తుంటాం. రోజూ వాడే వస్తువులే అయినా కొన్నిసార్లు వాటిలో ఊహించని విధంగా వివిధ రకాల జీవులు బయటపడుతుంటాయి. నీళ్లు తాగేందుకు ఫ్రిడ్జ్ డోరు తీస్తే.. కింద నుంచి పాములు బయటికి రావడం చూశాం. అలాగే...

Viral Video: ఏసీ మిషన్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. శుభ్రం చేసేందుకు తెరిచిచూడగా..

ఇళ్లల్లో కొన్నిసార్లు షాకింగ్ సీన్‌లు చూస్తుంటాం. రోజూ వాడే వస్తువులే అయినా కొన్నిసార్లు వాటిలో ఊహించని విధంగా వివిధ రకాల జీవులు బయటపడుతుంటాయి. నీళ్లు తాగేందుకు ఫ్రిడ్జ్ డోరు తీస్తే.. కింద నుంచి పాములు బయటికి రావడం చూశాం. అలాగే సీలింగ్ నుంచి కొండచిలువులు బయటికి వచ్చిన సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఏసీ ఫిల్టర్లను శుభ్రం చేసేందుకు తెరచిచూడగా.. లోపల షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని ఏసీ యంత్రంలో ఫిల్టర్లను శుభ్రం చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం చివరకు ఏసీ యంత్రాన్ని తెరిచాడు. అయితే లోపల అతడికి షాకింగ్ కనిపించింది. ఫిల్టర్లను తెరచి చూడగా.. అందులో (Bats in AC machine) చాలా గబ్బిలాలు దాక్కుని ఉన్నాయి. వాటిని చూడగానే అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Viral Video: ఆర్మీని తలదన్నేలా సింహం ట్రైనింగ్.. పిల్లలను చెట్టు ఎలా ఎక్కిస్తుందో చూడండి..

గబ్బిలాలు ఏసీ యంత్రంలోకి ఎలా వెళ్లాయబ్బా.. అని అవాక్కవడం అతడి వంతైంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇవి ఎలుకలా.. లేక.. గబ్బిలాలా’’.. అంటూ మరికొందరు, ‘‘అవి పైపుల గుండా లోపలికి వెళ్లి ఉండొచ్చు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కలపడానికి ఇంకేమీ మిగల్లేదా..! ఈ పెద్దాయన చేసిన టీపై నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

Updated Date - Apr 21 , 2024 | 05:02 PM