Share News

Viral: బస్సులో రెచ్చిపోయిన మహిళ.. టిక్కెట్ కొన్నాక కండక్టర్ చిల్లర ఇవ్వలేదని..

ABN , Publish Date - Apr 23 , 2024 | 09:28 PM

బస్సులో టిక్కెట్‌ కొన్న ఓ మహిళ.. కండక్టర్ చిల్లర తిరిగివ్వలేదని రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: బస్సులో రెచ్చిపోయిన మహిళ.. టిక్కెట్ కొన్నాక కండక్టర్ చిల్లర ఇవ్వలేదని..

ఇంటర్నెట్ డెస్క్: బస్సులో టిక్కెట్‌ కొన్న ఓ మహిళ.. కండక్టర్ చిల్లర తిరిగివ్వలేదని రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. హర్యానాలో(Haryana) జరిగిన ఈ ఘటనలో మహిళ బీభత్సం చూసి జనాలు మండిపడుతున్నారు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తొలుత మహిళ టిక్కెట్టు కొన్నాక చిల్లర కోసం కండక్టర్‌తో గొడవకు దిగింది. చిల్లర ఇవ్వాల్సిందేనంటూ మంకుపట్టు పట్టింది. అతడు ఏదో నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు తన చేతిలో ఉన్న టిక్కెట్టును కూడా చించిపారేసింది. బస్సులోని మరో ప్రయాణికుడు ఈ మొత్తం ఉదంతాన్ని రికార్డు చేసి నెట్టింట పెట్టడంతో వీడియో వైరల్‌గా మారింది (Haryana girl tears up bus ticket for conductor not returning change).

Viral: మానవత్వం అంటే ఇదే కదా! మనసుకు హత్తుకునే వీడియో!


వీడియో చూసిన వారిలో అధికశాతం మంది మహిళపై మండిపడ్డారు. కండక్టర్ ఓపిగ్గా నచ్చ చెబుతున్నా వినకుండా రెచ్చిపోవడం పద్ధతి కాదని హితువు పలికారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు సర్దుకుపోయినా తప్పులేదని కొందరు వ్యాఖ్యానించారు. వేల మంది ప్రయాణించే ప్రజారవాణా సాధనాల్లో కండక్టర్ల వద్ద అన్ని వేళ్లలా చిల్లర అందుబాటులో ఉండకపోవచ్చని అన్నారు. సర్దుబాటు ధోరణి ఉండాలని సూచించారు.

Read Latest Offbeat and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 09:46 PM