Share News

Home Making: వావ్.. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఎలుకలు అస్సలు అటువైపు రావంట.. ఇంతకీ అవేంటంటే..!

ABN , Publish Date - May 09 , 2024 | 04:30 PM

చాలామంది ఎలుకల బాధ తప్పించుకోవడానికి వాటిని చంపాలని అనుకుంటారు. మందు పెట్టాలని అనుకుంటారు. మరికొందరు వాటిని ట్రాప్ చేయడానికి బోన్ కూడా వాడతారు. కానీ అస్సలు ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉంటే ఈ గోల ఏమీ ఉండదు కదా.. ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి కొన్ని మొక్కలను పెంచితే సరిపోతుంది.

Home Making: వావ్.. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఎలుకలు అస్సలు అటువైపు రావంట.. ఇంతకీ అవేంటంటే..!

ఎలుకలు కాస్త పెద్దగా ఉన్న ఇల్లు, పాతగా ఉన్న ఇళ్లలో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఒకసారి ఒకటి కనిపించాయంటే ఇక మెల్లగా వాటి సంతానం పెరుగుతూ ఇల్లంతా ఎలుకల సైన్యం కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఎలుకల బాధ తప్పించుకోవడానికి వాటిని చంపాలని అనుకుంటారు. మందు పెట్టాలని అనుకుంటారు. మరికొందరు వాటిని ట్రాప్ చేయడానికి బోన్ కూడా వాడతారు. కానీ అస్సలు ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉంటే ఈ గోల ఏమీ ఉండదు కదా.. ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి కొన్ని మొక్కలను పెంచితే సరిపోతుంది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. ఇంతకీ ఆ మొక్కలేంటో తెలుసుకుంటే..

లావెండర్..

లావెండర్ సువాసన అంటే చాలామందికి ఇష్టం. అందుకే సువాసనగల కొవ్వొత్తుల తయారీలోనూ, స్ప్రేలు, సోపులు, తదితర సౌందర్య ఉత్పత్తులలోనూ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను ఉపయోగిస్తుంటారు. కానీ ఎలుకలు లావెండర్ వాసనను ద్వేషిస్తాయి. లావెండర్ సువాసన ఉన్నచోటు నుండి పారిపోతాయి. ఇంట్లో లావెండర్ మొక్కలను నాటితే ఎలుకల సమస్య నుండి బయటపడవచ్చు.

ఆవనూనె వాడితే జరిగే అద్భుతాలు ఇవే..!


నిమ్మగడ్డి..

నిమ్మ గడ్డి లేదా సిట్రోనెల్లా మొక్క గడ్డి లాంటిది. ఇది నిమ్మకాయ లాంటి సువాసనతో ఉంటుంది. దీని వాసన తాజాగా ఉంటుంది. ఈ వాసన అంటే ఎలుకలకు అస్సలు నచ్చదు. అంతే కాదు ఎలుకలు కూడా దీన్ని చాలా ద్వేషిస్తాయి. ఎలుకలను మాత్రమే కాకుండా కీటకాలను కూడా తరిమికొట్టడంలో నిమ్మగడ్డి మొక్క సహాయపడుతుంది.

పుదీనా..

పుదీనాను వంటల్లోనే కాకుండా ఔషదంగా కూడా ఉపయోగిస్తారు. పుదీనా ఆకులలో మెంథాల్ ఉంటుంది, దీని బలమైన వాసన ఎలుకలను దూరంగా ఉంచుతుంది. పుదీనా మొక్కలను ఇంట్లో ఉంచితే తాజా పుదీనా లభించడమే కాకుండా ఎలుకల బెడద తప్పుతుంది.

ఆవనూనె వాడితే జరిగే అద్భుతాలు ఇవే..!


రోజ్మేరీ..

రోజ్మేరీ నూనె జుట్టు కోసం ఉపయోగిస్తారు. రోజ్మేరీని అనేక వంటలలో కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలుకలు రోజ్మేరీ వాసనకు చాలా ఇబ్బంది పడతాయి. అందువల్ల ఎలుకలు ఈ మొక్క ఉన్న ప్రాంతాలలో తిరగవు. ఇంట్లో రోజ్మేరీని నాటితే ఎలుకలు ఉండవు.

నీలగిరి..

ఎలుకలను నివారించడానికి ఇంట్లో యూకలిప్టస్ మొక్కను నాటవచ్చు. యూకలిప్టస్ ఆకులలో యూకలిప్టాల్, లిమోనెన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. వీటి వాసన ఎలుకలను దూరం చేస్తుంది. ఎలుకలను ఇంటి నుండి తరిమి కొట్టడానికి ఈ మొక్కను పెంచవచ్చు.

అక్షయ తృతీయ గురించి ఈ నిజాలు తెలుసా..?

వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 09 , 2024 | 04:30 PM